AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranti Special Trains: పండక్కి ఊరెళ్తున్నారా..? అయితే ఈ గుడ్‌న్యూస్‌ మీకే!

సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నుండి ఆంధ్రాకు వెళ్లే ప్రయాణికుల కోసం పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. విశాఖపట్నం-చర్లపల్లి, అనకాపల్లి-వికారాబాద్ మధ్య నడిచే ఈ రైళ్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

Sankranti Special Trains: పండక్కి ఊరెళ్తున్నారా..? అయితే ఈ గుడ్‌న్యూస్‌ మీకే!
Train
SN Pasha
|

Updated on: Dec 30, 2025 | 9:13 PM

Share

సంక్రాంతి పండగకు నగరాల్లో ఉండే జనం సొంతూళ్లకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పండగను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి వేల సంఖ్యలో ఆంధ్రాకు జనం తరలివెళ్తారు. తెలంగాణలో కంటే ఆంధ్రాలో సంక్రాంతి మరింత బాగా జరుపుకుంటారు. ఆంధ్రా వాసులకు సంక్రాంతి ఎంత పెద్ద పండగో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోడి పందెలు, పిండి వంటలు, ముగ్గులు, చుట్టాలు, కొత్త అల్లుళ్లతో ఇళ్లన్ని కళకళలాడుతూ ఉంటాయి.

అంతటి ప్రముఖ్యత ఉన్న పండగ కనుక దాదాపు ‍ప్రతి ఒక్కరు వారి స్వగ్రామాలకు వెళ్తారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌ నగరం దాదాపు సగం ఖాళీ అయిపోతుంది. అయితే పండక్కి ఇంటి వెళ్లడం ఎంత సంతోషకరమైన విషయమో.. ప్రయాణం అంత దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా రైల్వే రిజర్వేషన్‌ దొరకడం చాలా కష్టం. చాలా మంది నెలల ముందుగానే తమ టిక్కెట్లు రిజర్వ్‌ చేసుకొని ఉంటారు. ఎప్పటిలాగే ఈసారి కూడా పండగ రద్దీ తీవ్ర ఉంటుందని గ్రహించిన సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది.

పండగ కోసం ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించిన ఎస్‌సీఆర్‌.. తాజాగా మరో మూడు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి..

  • రైలు నంబర్‌ 08511 విశాఖపట్నం టూ చర్లపల్లి సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి మరోసటి రోజు ఉదయం 08.15 గంటలకు చేరుకుంటుంది. జనవరి 10, 12, 17, 19 తేదీల్లో నడవనుంది.
  • రైలు నంబర్‌ 08512 చర్లపల్లి టూ విశాఖపట్నం మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది. జనవరి 11, 13, 18, 20 తేదీల్లో నడవనుంది.
  • రైలు నంబర్‌ 07416 అనకాపల్లి టూ వికారాబాద్ రాత్రి 9.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 12.30 గంటలకు చేరుకుంటుంది. జనవరి 18న నడవనుంది.

రైలు నెం. 08511/08512 విశాఖపట్నం – చర్లపల్లి – విశాఖపట్నం ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి. రైలు నెం.07416 అనకాపల్లి – వికారాబాద్ స్పెషల్ రైళ్లు ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. టిక్కెట్‌ బుకింగ్‌ డిసెంబర్‌ 31 (బుధవారం) ఉదయం 8 గంటలకు ఓపెన్‌ అవుతుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి