AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivo X300FE: వివో సిరీస్‌లో మరో సరికొత్త ఫోన్‌.. కెమెరా, ఫీచర్స్‌ లీక్‌..!

Vivo X300FE: వివో ఫోన్‌కు ఐదు సంవత్సరాల OS అప్‌డేట్స్‌, ఏడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇస్తు్నట్లు తెలుస్తోంది. Vivo X200T 90W వైర్డు ఫ్లాష్‌ఛార్జ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,200mAh బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల ఫ్లాట్..

Vivo X300FE: వివో సిరీస్‌లో మరో సరికొత్త ఫోన్‌.. కెమెరా, ఫీచర్స్‌ లీక్‌..!
Vivo X300fe
Subhash Goud
|

Updated on: Feb 18, 2026 | 8:02 PM

Share

Vivo X300FE: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో కొత్త X300 సిరీస్ మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువస్తోంది. అయితే దీని విడుదల, ఫీచర్స్‌పై ఎలాంటి ప్రకటన లేకపోయినప్పటికీ లీకులు మాత్రం హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇదే సీరిస్‌లో వివో X300 FE మార్కెట్లోకి రానుంది. ఈ హ్యాండ్‌సెట్ ఇప్పటికే ఉన్న వివో X300, వివో X300 ప్రోలలో చేరనుంది. కంపెనీ ఇంకా అధికారికంగా స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ను ధృవీకరించనప్పటికీ, రాబోయే ఫోన్ లక్షణాలతో పుకారు మొదలయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ లీకులు మొదలయ్యాయి. లీక్ ప్రకారం, ఈ హ్యాండ్‌సెట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ ద్వారా వస్తుందని తెలుస్తోంది. వివో X300 FE ఇతర లీకైన లక్షణాలలో కలర్ ఆప్షన్లు, స్టోరేజ్ వేరియంట్లు, RAM ఉన్నాయి.

Vivo X300 FE ఫీచర్లు (అంచనా):

పైన చెప్పినట్లుగా Vivo X300 FE స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్‌తో వస్తుందని పుకారు ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 12GB RAMతో వస్తుంది. అలాగే 256GB, 512GB స్టోరేజీలతో రానున్నట్లు లీకుల ద్వారా సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ నలుపు, నీలం అనే రెండు రంగుల ఎంపికలలో వస్తుందని భావిస్తున్నారు. Vivo X300 FE ఆండ్రాయిడ్ 16 ఆధారిత కంపెనీ కస్టమ్ UIలో రన్ కావచ్చు. ఇటీవల కంపెనీ భారతదేశంలో Vivo X200T ఫోన్‌ను ప్రకటించింది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek Dimensity 9400+ చిప్‌సెట్‌తో వస్తుంది. LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్‌తో జత చేసింది. Vivo X200T OriginOS 6పై రన్‌ అవుతుంది. ఇందులో ఆఫీస్ కిట్, మెరుగైన మల్టీ టాస్కింగ్ ఫీచర్లు, సిస్టమ్-స్థాయి ఆప్టిమైజేషన్‌లు వంటివి ఉన్నాయి.

Vivo ఫోన్‌కు ఐదు సంవత్సరాల OS అప్‌డేట్స్‌, ఏడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇస్తు్నట్లు తెలుస్తోంది. Vivo X200T 90W వైర్డు ఫ్లాష్‌ఛార్జ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,200mAh బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లేను మెటల్ ఫ్రేమ్‌లో ఉంచింది.ఇది స్టెల్లార్ బ్లాక్, సీసైడ్ లిలాక్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

కెమెరా విషయానికి వస్తే, Vivo X200T లో 50MP ZEISS సూపర్ టెలిఫోటో కెమెరా, IMX921 సెన్సార్‌తో నడిచే 50MP ZEISS ప్రధాన కెమెరా, 50MP ZEISS అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం స్మార్ట్‌ఫోన్ 32MP సెల్ఫీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Indian Railways: పెళ్లిళ్లు, టూర్ల కోసం మొత్తం రైలు లేదా కోచ్‌లను బుక్‌ చేసుకోవచ్చా? ఎలా?

ఇది కూడా చదవండి: Auto News: 7 సీట్ల కారు కేవలం రూ.5.65 లక్షలకే.. బేస్‌ మోడల్‌లోనే అద్భుతమైన ఫీచర్స్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us