AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mike Pe Charcha With Vishitha: వారానికి మూడు నాలుగు సినిమాలు వదిలేస్తున్నా.. కారణం ఇదే.. రవిబాబు కామెంట్స్..

తెలుగు చిత్ర పరిశ్రమలో 'డిఫరెంట్' అనే పదానికి నిలువుటద్దం రవిబాబు. సీనియర్ నటుడు చలపతిరావు వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేకమైన పంథాను సృష్టించుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా రవిబాబు వేసిన ప్రతి అడుగులోనూ ఒక వైవిధ్యం కనిపిస్తుంది. తాజాగా టీవీ9 (TV9) నిర్వహించిన "మైక్ పై చర్చ" (Mike Pe Charcha) అనే పాడ్‌కాస్ట్ ప్రోగ్రామ్‌లో రవిబాబు పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Mike Pe Charcha With Vishitha: వారానికి మూడు నాలుగు సినిమాలు వదిలేస్తున్నా.. కారణం ఇదే.. రవిబాబు కామెంట్స్..
Ravi Babu
Rajitha Chanti
|

Updated on: May 01, 2026 | 8:22 PM

Share

టాలీవుడ్‌లో విలక్షణమైన దర్శకుడిగా, నటుడిగా రవిబాబుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ‘అల్లరి’, ‘నచ్చావులే’, ‘అవును’ వంటి వినూత్న చిత్రాలతో తన మార్కు చూపించిన ఆయన, ఇటీవల టీవీ9 నిర్వహించిన ‘మైక్ పే చర్చా విత్ విషిత’ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లోని పరాజయాల అలాగే తన సినిమాలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఒక సినిమా ఫ్లాప్ అయితే దర్శకుడిపై ఉండే ఒత్తిడి, ఆ సమయంలో కలిగే వేదన గురించి ఆయన పంచుకున్న విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కేవలం సక్సెస్ మాత్రమే కాదు, ఫెయిల్యూర్స్ కూడా తన ప్రయాణంలో భాగమేనని, ఏ సినిమానైనా తాను పూర్తి అంకితభావంతోనే చేస్తానని రవిబాబు వివరించారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన తీరు, వైఫల్యాలను అంగీకరించే ఆయన ధైర్యాన్ని చూసి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అలాగే తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే, విభిన్నమైన కథలను వెండితెరకు పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : కొబ్బరికాయ కుళ్లిపోయిందని ఆగిపోయిన సినిమా.. బాలయ్య, పవన్ ఆ మూవీ చూసుంటేనా.. డైరెక్టర్ కామెంట్స్..

Follow Us