ఆ హీరో అంటే పిచ్చి.. ఒక్కసారైనా అతడితే సినిమా చేయాలి.. మృణాల్..
Rajitha Chanti
Pic credit - Instagram
01 May 2026
టాలీవుడ్‌లో 'సీతారామం' సినిమాతో అడుగుపెట్టి, తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో 'సీత'గా సుస్థిర స్థానం సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్.
కేవలం రెండు మూడు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన ఈ ముద్దుగుమ్మ, తాజాగా తనకు ఓ టాలీవుడ్ హీరో అంటే పిచ్చి ఇష్టమని.. సినిమా చేయాలని ఉందని తెలిపింది.
తనకు అల్లు అర్జున్ అంటే అమితమైన ఇష్టమని, ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం తన కల అని ఆమె వెల్లడించారు. ఒక్కసారైన కలిసి నటించాలని ఉందని తెలిపింది.
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ, అల్లు అర్జున్ నటన, ఆయన డాన్స్ స్టైల్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు.
అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఆయన డాన్స్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. ఆయనతో కలిసి ఒక్క ఫ్రేములో కనిపించినా నా కల నెరవేరినట్టే అని అన్నారు.
గత కొంతకాలంగా అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్టులో మృణాల్ హీరోయిన్‌గా నటిస్తోందని వచ్చిన వార్తలపై ఆమె స్పందించింది.
నిజంగానే నాకు ఆ ఛాన్స్ వచ్చిందా? అయితే నా కోసం అందరూ ప్రార్థించండి. అదే నిజమైతే మనమందరం కలిసి పెద్ద సెలబ్రేషన్ చేసుకుందాం అని అన్నారు.
మరాఠీ అమ్మాయి అయినప్పటికీ, తెలుగు ప్రేక్షకులు తనను ఓ సొంత ఆడబిడ్డలా ఆదరిస్తున్నారని మృణాల్ ఎమోషనల్ అయ్యారు. మంచి కథాబలం ఉన్న సినిమాలు చేస్తానని అన్నారు.