ఖరీదైన హెయిర్‌డైస్ వద్దు.. ఈ రెండు వస్తువులతో ఇంట్లోనే తెల్లజుట్టుకు చెక్ పెట్టండి!
మీ వయస్సు జస్ట్ 25 సంవత్సరాల. అప్పుడే మీకు తెల్ల జుట్టు వచ్చిందా? జుట్టును నల్లగా మార్చుకునేందుకు మార్కెట్‌లో దొరికే హెయిర్ డై వాడి నిరాశ చెందారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఇప్పుడు మీరు ఇంట్లో ఉండే తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇంట్లో దొరికే రెండు వస్తువలతోనే జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.

మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపదార్థాల కారణంగా ఈ మధ్య చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో తెల్లజుట్టు, జుట్టు రాలడం అనేది ప్రధాన సమస్య. పదిలో ఎనిమిది మంది ఈ సమస్యతో బాధపడుతన్నారు. జుట్టును నల్లగా మార్చుకునేందుకు మార్కెట్‌లో దొరికే రకరకాల రసాయనాలు వాడి నిరాశ చెందుతున్నారు. అలాంటి వారికోసమే ఓ అద్భతమైన ఇంటి చిట్కాను తీసుకొచ్చాం.దీన్ని ఉపయోగించి మీరు ఇంట్లోనే తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టవచ్చు.
ఇందుకోసం మీర పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ పెరుగులో ఈ రెండు వస్తువులను కలిపి తలకు పట్టించి మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. మీ తెల్ల జుట్టు సహజంగా నల్లబడుతుంది. కాబట్టి ఇంట్లోనే జుట్టును నల్లగా మార్చే హెయిర్ డైను ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం.
హెయిర్ డై తయారీ కావాల్సిన పదార్థాలు
పెరుగు: ఇది జుట్టుకు పోషణను అందించడంతో చక్కగా పనిచేస్తుంది. శనగపిండి: ఇది తలలో రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు పెరుగుదలకు తోల్పడుతుంది పసుపు: పుసుపులో యాంటీ సెప్టిక్ గుణాలను ఉంటాయి. ఇది జుట్టును నల్లబర్చడంలో సహాయపడుతుంది
పెరుగు,పుసుపు హెయిర్ డై తయారీ విదానం
ఇందుకోసం మీరు ఒక గిన్నెలో తగినంత శనగపిండిని తీసుకొని, అందులో పెరుగు కలిపి మెత్తని పేస్ట్‌లా చేయండి. ఈ పేస్ట్‌లో ఒక చిటికెడు పసుపు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు మరియు కుదుళ్లకు పట్టించి బాగా మసాజ్ చేయండి. సుమారు 30 నిమిషాల పాటు అలాగే ఉంచుకోండి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి.
పెరుగు,పుసుపు హెయిర్ డై ప్రయోజనాలు
పెరుగులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మంచి బ్యాక్టీరియా జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శనగపిండి రక్త ప్రసరణను పెంచి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఇది జుట్టును వేర్ల నుండి దృఢంగా చేస్తుంది. అలాగే జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. కాబట్టి మెరుగైన ఫలితాల కోసం వారానికి 2 నుండి 3 సార్లు, కనీసం ఒకటి లేదా రెండు నెలల పాటు ఈ మాస్క్‌ను ఉపయోగించండం మంచిది.
Note: ఈ సమాచారం ఇంటి చిట్కాలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. వీటిని పాటించే ముందు ఒకసారి నిపుణుల లేదా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. వీటిని Tv9 దృవీకరించడం లేదు
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
