ఏంటీ.. ఈ హీరోయిన్ గోల్ఫ్‌లో నేషనల్ ప్లేయర్ ఆ.. ? ఎవరంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
01 May 2026
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు సినిమా రంగంలోకి రాకముందు ఒక అద్భుతమైన క్రీడాకారిణి.
తాజాగా ఆమె తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న పరిస్థితులు, గోల్ఫ్ క్రీడను ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది అనే విషయాలు ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
రకుల్ చిన్నతనం నుంచే క్రీడల్లో చాలా చురుగ్గా ఉండేవారట. ఆమె జూనియర్ స్థాయిలో జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణిగా రాణించానని చెప్పుకొచ్చారు.
ఎన్నో టోర్నమెంట్లలో పాల్గొని విజయాలు సాధించారు. నిజానికి ఆమె గోల్ఫ్ క్రీడలో ఒక ప్రొఫెషనల్ కెరీర్ వైపు పయనిస్తున్నప్పుడే సినిమాలపై ఆసక్తి పెరిగిందట.
గోల్ఫ్ ఆడుతున్న సమయంలో ఎండలో ఎక్కువగా గడపడం వల్ల ఆమె చర్మం కమిలిపోయేదని, అది మోడలింగ్ కెరీర్‌కు ఇబ్బందిగా మారుతుందని భావించిందట.
దీంతో గోల్ఫ్ వదిలేసి మోడలింగ్ వైపు అడుగులు వేసిందట. ఆ పట్టుదలతోనే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఐదు టైటిళ్లను గెలుచుకున్నారు.
తెలుగులో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' చిత్రంతో ఆమెకు భారీ బ్రేక్ లభించింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా స్టార్ హీరోల సరసన నటిస్తూ మెప్పించింది.
ప్రస్తుతం రకుల్ సినిమాలకు దూరంగా ఉంటుంది. తన ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్న రకుల్.. ఇప్పుడు సినిమాలు చేయకుండా కేవలం ఫ్యామిలీతో ఉంటుంది.