AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Account: బ్యాంకు అకౌంట్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం ఖచ్చితంగా తెలియాల్సిందే!

Bank Account: రెండు సంవత్సరాలుగా ఉపయోగించని బ్యాంక్ ఖాతాలు ఇనాపరేటివ్ గా పరిగణించబడతాయి. అటువంటి ఖాతాలపై మినిమమ్ బ్యాలెన్స్ లేనందుకు బ్యాంకు చార్జీలు వసూలు చేయకూడదు అనేది RBI నియమం. అనవసరమైన పెనాల్టీలు చెల్లించకుండా మీ నిరుపయోగ బ్యాంక్ ఖాతాను ఎలా మూసివేయాలో తెలుసుకోండి..

Bank Account: బ్యాంకు అకౌంట్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం ఖచ్చితంగా తెలియాల్సిందే!
Bank Account
Subhash Goud
|

Updated on: Feb 18, 2026 | 3:33 PM

Share

Bank Account Rules: చాలామందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉంటాయి. వాటిలో కొన్నింటిని చాలా కాలంగా ఉపయోగించకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో రెండు సంవత్సరాలుగా ఒక్క ట్రాన్సాక్షన్ కూడా జరగని బ్యాంక్ ఖాతాను ఇనాపరేటివ్ బ్యాంక్ అకౌంట్‌గా పరిగణిస్తారు. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదని బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తున్నామని చెప్పి, ఖాతాదారులను ఆందోళనకు గురిచేస్తుంటాయి.

అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం, ఇనాపరేటివ్ బ్యాంక్ ఖాతాలపై మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయనందుకు బ్యాంకు ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయకూడదు. ఈ చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఖాతాదారులకు లేదని నిపుణులు చెబుతున్నారు.

ఒకవేళ మీ బ్యాంక్ ఖాతా రెండు సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉండి, దానిని మూసివేయాలని అనుకుంటే బ్యాంకుకు వెళ్లి ఆ ఖాతాను ముందుగా ఆపరేటివ్ ఖాతాగా మార్చమని అడగండి. ఆ తర్వాత ఎలాంటి పెనాల్టీలు లేదా చార్జీలు కట్టకుండానే మీరు ఆ ఖాతాను క్లోజ్ చేయమని బ్యాంకుకు స్పష్టం చేయవచ్చు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) నియమాలు మీకు అనుకూలంగా ఉన్నందున బ్యాంకులు దీనిని తప్పనిసరిగా పాటించాలి. అనవసరమైన ఆర్థిక భారాన్ని నివారించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Auto News: 7 సీట్ల కారు కేవలం రూ.5.65 లక్షలకే.. బేస్‌ మోడల్‌లోనే అద్భుతమైన ఫీచర్స్‌!

అయితే ఖాతా ‘ఇన్‌ఆపరేటివ్’ లేదా ‘డార్మెంట్‌’గా మారిన తర్వాత, మినిమమ్ బ్యాలెన్స్ లేనందుకు పెనాల్టీలు విధించరు. కానీ, అంతకుముందు పెండింగ్‌లో ఉన్న చార్జీలు ఉంటే అవి మైనస్ బ్యాలెన్స్ చూపించవచ్చు. అప్పుడు ఛార్జీలను తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది.

మీరు అకౌంట్ క్లోజ్ చేయాలనుకుంటే బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించి, “అకౌంట్ క్లోజర్ ఫామ్” నింపి ఆ అకౌంట్‌కు సంబంధించిన డెబిట్ కార్డ్, చెక్‌బుక్‌లను అందజేయాలి. అప్పుడు బ్యాంకు సిబ్బంది మీ అకౌంట్‌ను క్లోజ్‌ చేస్తారు.

ఇది కూడా చదవండి: మీ BSNL నంబర్‌ డీయాక్టివేట్‌ అయ్యిందా? మీకో గుడ్‌న్యూస్‌.. చౌకైన ప్లాన్‌తో 90 రోజులు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us