- Telugu News Photo Gallery Cinema photos The mega hero who got a blockbuster hit with the film that Vijay Deverakonda rejected
విజయ్ దేవరకొండ వదులుకున్న మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా హీరో!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అర్జున్ రెడ్డి మూవీతో మంచి గుర్తింపు తెచ్చున్నాడు ఈ హీరో. ఈ మూవీ తర్వాత ఓ వర్ నైట్ స్టార్ హీరో స్టేటస్ అందుకున్నారు. కాగా, తాజాగా ఈ హీరోకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Apr 26, 2025 | 12:06 PM

విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా కంటే ముందు చాలా సినిమాల్లో సైడ్ కార్యెక్టర్స్ లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పెళ్లి చూపులు మూవీతో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో అర్జున్ రెడ్డి సినిమాలో ఛాన్స్ కొట్టే శాడు.

విజయ్ దేవరకొండ, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ డ్రామా పెళ్లి చూపులు నేషనల్ అవార్డు కైవసం చేసుకుంది. ఇక ఈ మూవీ అనంతరం విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి ఒక సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ఈ మూవీ తర్వాత ఈ హీరో ఓవర్ నైట్ స్టార్ గా మారడమే కాకుండా యూత్ ఫేవరెట్ హీరో అయిపోయాడు.

ఇక అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండకు సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ఈ సినిమా తర్వాత మహానటి సినిమాలో కీలక పాత్రలో మెరవగా, గీత గోవిందం సినిమాతో మరో సారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.అయితే ఈ హీరోకు చాలా సినిమా అవకాశాలు వచ్చిన్నప్పటి ఆయన సినిమాలు రిజక్ట్ చేశాడంట. ముఖ్యంగా ఈ హీరో రిజక్ట్ చేసిన సినిమాతో మెగా హీరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడంట. ఆ సినిమా ఏది అంటే?

ఉప్పెన సినిమా ఎంత మంచి విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీతో కృతిశెట్టికి, వైష్ణవ్ తేజకు మంచి ఫేమ్ వచ్చింది . బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకక్కిన ఈ సినిమా మొదటి రోజునుంచే మంచి కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో మొదట విజయ్ దేవర కొండను అనుకోగా, విజయ్ రిజెక్ట్ చేయడంతో మెగా హీరోకు ఛాన్స్ దక్కింది.

విజయ్ దేవరకొండకు ఆర్‌ఎక్స్ 100 మూవీ ఆఫర్ వచ్చిందంట కానీ అప్పటికే అర్జున్ రెడ్డి మూవీ చేసి ఉన్న విజయ్ దేవరకొండ దానిని రిజెక్ట్ చేశాడట. అంతే కాకుండా, ఇస్మార్ట్ శంకర్ సినిమాకు కూడా ముందుగా పూరి జగ్నాధ్, విజయ్ దేవరకొండ అనుకున్నాడంట. కానీ విజయ్ దేవరకొండకు హీరో క్యారెక్టర్ నచ్చకపోవడంతో దానిని వదులుకున్నాడు



