చనిపోయి కాటికి వెళ్లే వరకు తోడుగా ఉండే నాలుగు ఇవే !

samatha 

26 April 2025

Credit: Instagram

చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన గొప్ప తత్వవేత్త. ఎన్నో విషయాల్లో ఆయనకు మంచి పట్టు ఉంది. దేని గురించి అయినా సరే ఆయన అవలీలగా చెప్పేసేవారు.

చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు చాలా విషయాల గురించి తెలియజేయడం జరిగింది. డబ్బు, అప్పులు, ప్రేమ, పురుషులుఓటమి, జీవితంల పాటించవలసిన నియమాలు . ఇలా ఎన్నింటి గురించో ఆయన వివరంగా తన చాణక్య నీతి శాస్త్రంలో తెలియజేశారు.

ఆచార్య చాణక్యుడు ముఖ్యంగా జీవితంలో ఎలా మెదగాలి, జీవితంలో ఉన్నతస్థానానికి వెళ్లాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి తెలపిన విషయం తెలిసిందే.

అయితే చాణక్యడు మనిషి చనిపోయిన తర్వాత కూడా ఓ నాలుగు విషయాలు మాత్రం ఎప్పుడూ నీ కాటివరకు తోడుగా ఉంటాయని తెలిపాడు. అవి.

మనం నేర్చుకున్న జ్ఞానం ఎప్పుడూ మనకు తోడుగానే ఉంటుందంట. ముఖ్యంగా మనం చనిపోయే వరకు ఇది మనిషిని వీడివెళ్లదు అంటారు.

దానం చేయడం చాలా మంచిది అని చెబుతుంటారు. అయితే మనం బతికి ఉన్నప్పుడు చేసే దానాలు కూడా మన కాటివరకు మనకు తోడుగా ఉంటాయని చెబుతున్నారు పండితులు.

ధర్మం అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. ధర్మం వలనే మంచి, చెడు, చివరకు ఒక వ్యక్తి ప్రవర్తన అతని గురించి చాలా విషయాలను తెలియచేస్తుంది. ఇది కూడా చినిపోయే వరకు తోడుంటుందంట.

మనం చేసే పనులు, మంచైనా చెడైనా, మనల్ని వీడవు. మంచి పనులు చేసే వారికి ఆ ఫలితం జీవితంలోనే కాదు, చనిపోయాక కూడా దక్కుతుంది. అందుకే మనం ఎల్లప్పుడూ మంచి పనులే చేయాలి.