ఈ ఫొటోలో ఉన్న చిన్నది ఎవరో గుర్తు పట్టారా? యూత్ ఫేవరెట్!

samatha 

25 April 2025

Credit: Instagram

ఈ ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఎవరో తెలుసా? తన అందంతో, గొంతుతో ఎంతో మంది మదిని దోచుకుంది ఈ అమ్మడు.

కామెడీ షోతో తెలుగు అభిమానులకు పరిచయమై తన యాంకరింగ్‌తో మంచి ఫేమ్ సంపాదించుకుంది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకంది.

ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా? శ్రీముఖి. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్ హీరోయిన్లకు ధీటుగా ఈ బ్యూటీ ఉంటుంది.

పటాస్ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు, తన కామెడీ, పంచ్ డైలాగ్స్, అల్లరితో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 ఓ వై పు సినిమాలు, మరో వైపు రియాల్టీ షోలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ముఖ్యంగా చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ తన నటతో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.

ముఖ్యంగా షోలలో ఈ బ్యూటీ చేసే అల్లరి అందరి మనసుకు హాయినిస్తుంది. తన దైన తీరులో కామెడీ పండిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.

బిగ్ బాస్ కు వెళ్లి తన వాయిస్, ఆట తీరుతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని రన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన తర్వాత ఈ అమ్మడుకు మరింత పాపులారిటీ వచ్చింది.

ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ వరస ఫొటో షూట్ లతో అందరినీ ఆకట్టుకుంది. కాగా, తాజాగా ఈ బ్యూటీ చిన్ననాటి ఫొటో వైరల్ అవుతుంది.