ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా అస్సలే తీసుకోకూడని ఫుడ్ ఇదే!
samatha
22 April 2025
Credit: Instagram
ఉదయం అయ్యిందంటే చాలు చాలా మంది, బ్రేక్ ఫాస్ట్ చేయాలంటే తెగ ఆలోచిస్తుంటారు. కొందరు త్వరగా పూర్తి కావాలని ఏదో ఒకటి చేస్తుంటారు.
అయితే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా కొన్ని రకాల ఫుడ్ అస్సలే తీసుకోకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అది ఏదో చూద్దాం.
పాలు,ధాన్యాలతో చేసే బ్రేక్ ఫాస్ట్ అస్సలే తీసుకోకూడదంట.ఇది ఇన్సులిన్ స్పైక్స్ శక్తి క్రాష్లకు దారితీస్తుందంటున్నార
ు నిపుణులు.
అలాగే చాలా మంది ఉదయం టీ, బిస్కెట్స్ అల్పాహారంగా తీసుకుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదంట. ఇందులో ఎలాంటి పోషకాలు ఉండవంటున్నారు నిపుణులు.
ఇంకొంత మంది ఉదయం ప్రాసెస్ చేసిన ఫుడ్ శాండ్విచ్, ఫిజ్జా వంటివి లేదా బ్రెడ్ కాంబోలో తయారైన ఫుడ్ తీసుకుంటారు. ఇది శరీరంలో చక్కెర స్థాయిలను
పెంచుతుందంట.
ఇక పిల్లల కోసం చాలా మంది తల్లులు ఓట్స్ టిఫిన్ గా చేస్తుంటారు. ఇందులో ఫైబర్ లేదా ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. ఇది చక్కెర క్రాష్ కోరికలకు కారణం అవుతుందం
ట.
ఇంకొంత మంది ఉదయాన్నే పొట్ట లైట్ గా ఉండాలని ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటారు. కానీ దీని వలన ప్రోటీన్ , ఫైబర్ వంటివి శరీరానికి అందలేవంటున్నారు నిపుణులు.
చాలా మంది త్వరగా అయిపోతుందని ఉప్మా, పోహా చేస్తుంటారు. కానీ ఇవి త్వరగా ఆకలిని పెంచడమే కాకుండా బరువు పెరిగేలా చేస్తాయంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
రెడ్ డ్రెస్ లో అదిరిపోయిన మీనాక్షి చౌదరి.. ఎంత బాగుందో కదా..
ఆ అతి ఆకలి మీ జీవితాన్నే నాశనం చేస్తుంది జాగ్రత్త: చాణక్య నీతి
ఈ ఐదు మొక్కలు మీ ఇంట్లో ఉంటే.. అదిరిపోద్ది అంతే...