AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: కోరికలే కాటేస్తే.. పేట్రేగిపోయి ప్రైవేట్ పార్టులోకి.. ఎక్స్‌రే చూసి కంగుతిన్న డాక్టర్లు

డాక్టర్లు ఎప్పుడూ చిత్ర విచిత్రమైన కేసులతో సవాసం చేయాల్సి వస్తుంది. ఇక స్వీయ సంతృప్తి కోసం హార్మోన్స్ కంట్రోల్ చేసుకోలేని బ్యాచ్ చేసే పనులు అన్ని ఇన్ని కాదు. అలాంటి ఓ కేసు డాక్టర్లు తమ జర్నల్‌లో పొందుపరిచారు. అదేంటంటే వివరాలు..

Viral: కోరికలే కాటేస్తే.. పేట్రేగిపోయి ప్రైవేట్ పార్టులోకి.. ఎక్స్‌రే చూసి కంగుతిన్న డాక్టర్లు
Trending
Ravi Kiran
|

Updated on: Apr 26, 2025 | 12:07 PM

Share

క్లినికల్ సినారియోస్‌లో డాక్టర్లు తరచూ పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వారికి ఎదురయ్యే చిత్రవిచిత్రమైన కేసులు వినడానికి, చికిత్స చేయడానికి కొంచెం డిఫెరెంట్‌గా ఉంటాయి. మానసిక అనారోగ్యం, మేధో వైకల్యం.. రెండింటితో లింక్ అయ్యి ఉన్న కేసులను డీల్ చేయడం డాక్టర్లకు కత్తి మీద సాము లాంటిది. సరిగ్గా ఈ తరహ ఓ కేసును విజయవంతంగా క్లోజ్ చేశాడు ఒక డాక్టర్. తేలికపాటి మేధో వైకల్యం ఉన్న ఓ 23 ఏళ్ల వ్యక్తి స్వీయ సంతృప్తి కోసం ఏకంగా హ్యాండ్‌హెల్డ్ బిడెట్ షవర్‌ను మలద్వారంలోకి చొప్పించుకున్నాడు. అమెరికాకు చెందిన ఈ వ్యక్తికి ఎప్పుడు.. ఏ సమయంలో ట్రీట్‌మెంట్ ఇచ్చారో.. డిశ్చార్జ్ ఎప్పుడు చేశారన్నది డాక్టర్లు గోప్యంగా ఉంచినప్పటికీ.. ఈ కేసును మాత్రం తమ జర్నల్‌లో జనవరి నెలాఖరున పొందుపరిచారు.

వివరాల్లోకి వెళ్తే.. ఈ కేసులోని పేషెంట్ ఓ 23 ఏళ్ల వ్యక్తి.. ప్రీ స్కూల్, పాఠశాలలో చదువుతున్న సమయంలో అతడికి లెర్నింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ క్రమేపీ తగ్గుతూ వచ్చాయి. ఇలా జరుగుతున్నా.. తల్లిదండ్రులు అతడికి ఎలాంటి మెడికేషన్ ఇవ్వలేదు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లలేదు. జనవరి నెల చివర్లో అత్యవసర చికిత్స నిమిత్తం ఆ వ్యక్తిని ఆస్పత్రికి తీసుకొచ్చారు డాక్టర్లు. తీరా అక్కడున్న వైద్యులు చెక్ చేయగా.. మలద్వారంలో హ్యాండ్‌హెల్డ్ బిడెట్ షవర్‌ జొప్పించి ఉంది. దాని వల్ల తీవ్రమైన నొప్పి, అసౌకర్యానికి గురై ఇబ్బందులు పడ్డాడు సదరు బాధితుడు. అయితే అతడు ఇలా చేయడం ఇదేం మొదటిసారి కాదు. ఆరు నెలల కిందట ఇలాగే స్వీయ సంతృప్తి కోసం సదరు బాధితుడు తన మలద్వారంలో జోప్పించుకోగా.. దానికి స్వయంగా తొలగించుకోగలిగాడు. రెండోసారి మాత్రం చేసినా.. ఎంతకూ బయటకు రాకపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు తల్లిదండ్రులు.

అతడికి డాక్టర్లు పలు టెస్టులు, ఎక్స్‌రే తీసి.. ఆపరేషన్‌కు సిద్దం చేశారు. అంతేకాదు ఓ ప్లంబర్‌ను పిలిచి.. పైప్‌లోని బయట ఉన్న కొంతభాగాన్ని తొలగించారు. ఇక ఆ తర్వాత డాక్టర్లు బాధితుడికి జనరల్ అనేస్థిషియా ఇచ్చి.. శస్త్రచికిత్స నిర్వహించారు. సుమారు మూడున్నర గంటల ఆపరేషన్ అనంతరం.. ఆ హ్యాండ్‌హెల్డ్ బిడెట్ షవర్‌ పైప్‌ను డాక్టర్లు అతడి శరీరం నుంచి తొలగించారు. అదృష్టవశాత్తు ఆ ఫారిన్ అబ్జెక్ట్ వల్ల బాధితుడికి ఇంటర్నల్ డ్యామేజ్ ఏమి జరగలేదు. అలాగే బ్లడ్ కూడా బ్లీడ్ అవలేదు. స్వీయ సంతృప్తి కోసమే తాను ఇలా చేశానని డాక్టర్లకు స్పష్టం చేశాడట సదరు బాధితుడు. కాగా, మూడు రోజుల పర్యవేక్షణ అనంతరం బాధితుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.