Andhra Pradesh News: తెల్లారితే యువకుడి పెళ్లి.. ఆమె ఎంట్రీతో కథంతా రివర్స్ అయ్యింది.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..
Andhra Pradesh News: ఉరవకొండ కు(Uravakonda) చెందిన అబ్బాయి గుత్తికి చెందిన అమ్మాయి ఇద్దరికీ పెద్దలు పెళ్లి(Marriage) నిశ్చయించారు పెద్దలు. పెళ్లికి సంబంధించి..
Andhra Pradesh News: ఉరవకొండ కు(Uravakonda) చెందిన అబ్బాయి గుత్తికి చెందిన అమ్మాయి ఇద్దరికీ పెద్దలు పెళ్లి(Marriage) నిశ్చయించారు పెద్దలు. పెళ్లికి సంబంధించి బంధుమిత్రులందరికీ ఆహ్వానాలు అందజేశారు. పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మరో 24 గంటల్లో పెళ్లి.. సరిగ్గా అప్పుడే ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. వరుడి ప్రేమాయణం(Love) బయటపడింది. తనను 14 సంవత్సరాలుగా ప్రేమించి వంచించాడని ప్రియురాలు ఉరవకొండ పోలీసులను ఆశ్రయించింది. దాంతో అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో జరగాల్సిన ఓ పెళ్లి వేడుక అర్ధాంతరంగా ఆగిపోయింది. పెళ్లి చేసుకోవాల్సిన వరుడు కటకటాల పాలవడంతో పెళ్లి నిలిపివేశారు.
వివరాల్లోకెళితే.. ఉరవకొండ పట్టణంలో గార్మెంట్స్ షాప్ నిర్వాహకుడు షర్ఫుద్దీన్, అదే పట్టణానికి చెందిన అమ్మాయి తో ప్రేమ.. ఇష్క్ .. కాదల్.. నువ్వు లేక నేను లేను అంటూ కొన్ని సంవత్సరాలుగా ప్రేమ పాఠాలు వల్లించాడు. ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి వంచించాడు. పెళ్లి మాత్రం మరో అమ్మాయితో చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఒక్కరోజు ఆగితే మరో అమ్మాయితో జీవితం పంచుకోవడానికి సిద్ధమయ్యాడు. అయితే, తనను మోసం చేసి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన విషయం తెలుసుకున్న ప్రియురాలు తనకు న్యాయం చేయాలంటూ ఉరవకొండ పోలీసులను ఆశ్రయించింది. ఉరవకొండ పట్టణంలోని ఓ సచివాలయంలో పనిచేస్తున్న ఆ అమ్మాయికి మద్దతుగా సచివాలయ సిబ్బంది నిలిచారు. యువతికి న్యాయం చేయాలంటూ సచివాలయ సిబ్బంది అంతా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పెళ్లి కొడుకు షరీఫుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై 420, 376 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. మొత్తం మీద ఒక్క వంచకుడి ప్రేమవ్యవహారం మూడు కుటుంబాల మధ్య చిచ్చు రేపింది. అటు ఆ కుటుంబాల పెద్దలకు, ఇద్దరు యువతుల జీవితాలలో అశాంతి నెలకొల్పింది.
Also read:
UP Election 2022: మీ వెంట మేమున్నాం.. ముస్లిం మహిళల పోరాటంపై ప్రధాని మోడీ ప్రశంసలు..