DJ Tillu: ‘డీజే టిల్లుతో ఇట్లుంటది మరి’.. అంగరంగవైభవంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. లైవ్‌ వీడియో..

DJ Tillu Pre Release Event: చిన్న సినిమాగా తెరకెక్కి భారీ చిత్రంగా మారింది డీజే టిల్లు. ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాతో పాటు, రెగ్యులర్‌ మీడియాలోనూ డీజే టిల్లు పేరు బాగా వినిపిస్తోంది. ముఖ్యంగా యూత్‌ను టార్గెట్‌ చేసుకొని తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి...

DJ Tillu: 'డీజే టిల్లుతో ఇట్లుంటది మరి'.. అంగరంగవైభవంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. లైవ్‌ వీడియో..
Dj Tillu
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 10, 2022 | 7:09 PM

DJ Tillu Pre Release Event: చిన్న సినిమాగా తెరకెక్కి భారీ చిత్రంగా మారింది డీజే టిల్లు. ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాతో పాటు, రెగ్యులర్‌ మీడియాలోనూ డీజే టిల్లు పేరు బాగా వినిపిస్తోంది. ముఖ్యంగా యూత్‌ను టార్గెట్‌ చేసుకొని తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. హారిక హాసిని అనుబంధ సంస్థ సీతర ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండడం, సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌లు ఒక్కసారిగా సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ఈ సినిమాను ఫిబ్రవరి 12 (శుక్రవారం) విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

నిజానికి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనున్నారు. కానీ అదే సమయంలో కొన్ని సినిమాలు విడుదల కావడంతో చిత్ర యూనిట్‌ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇదిలా ఉంటే ఒకానొక సమయంలో డీజే టిల్లు ఓటీటీలో విడుదలవుతుందని వార్తలు వచ్చాయి. ఓటీటీ సంస్థలు కూడా భారీగా ఆఫర్‌ చేసిన్పటికీ చిత్ర యూనిట్‌ థియేటర్‌లోనే విడుదల చేయడానికి మొగ్గు చూపింది.

ఇదిలా ఉంటే తాజాగా సినిమా విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే గురువారం సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోస్‌లో జరుగుతోన్న ఈ ఈవెంట్‌కు చిత్ర యూనిట్‌ సభ్యులంతా హాజరయ్యారు. డీజే టిల్లు ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ లైవ్‌ వీడియోను ఇక్కడ చూడండి.

Also Read: Corona Virus: కరోనా నిబంధనలకు, వ్యాక్సిన్ కి వ్యతిరేకంగా ఆ దేశంలో భారీ నిరసనలు..భారతీయులకు పలు సూచనలు చేసిన హైకమీషన్

Rashmika: క్యూట్‌ సెల్ఫీ ఫోటోను పోస్ట్‌ చేసిన రష్మిక.. వైరల్‌గా మారిన సమంత రియాక్షన్‌..

IND vs WI: డేరింగ్ డెసిషన్స్‌కి కేరాఫ్ అడ్రస్ టీమిండియా సారథి.. చిన్న ఎరతో విండీస్ ఆట కట్టించాడు: దినేష్ కార్తీక్