Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: కరోనా నిబంధనలకు, వ్యాక్సిన్ కి వ్యతిరేకంగా ఆ దేశంలో భారీ నిరసనలు..భారతీయులకు పలు సూచనలు చేసిన హైకమీషన్

Corona Virus: కరోనా వ్యాప్తి నిరోధించడానికి కెనడా(canada) ప్రభుత్వం US-కెనడా సరిహద్దులోని ట్రక్ డ్రైవర్లందరికీ కరోనా వ్యాక్సినేషన్‌(Corona Vaccine)ను తప్పనిసరి చేసింది. దీంతో కెనడాలోని ట్రక్ డ్రైవర్లు కరోనా

Corona Virus: కరోనా నిబంధనలకు, వ్యాక్సిన్ కి వ్యతిరేకంగా ఆ దేశంలో భారీ నిరసనలు..భారతీయులకు పలు సూచనలు చేసిన హైకమీషన్
Corona Virus
Follow us
Surya Kala

|

Updated on: Feb 10, 2022 | 5:36 PM

Corona Virus: కరోనా వ్యాప్తి నిరోధించడానికి కెనడా(canada) ప్రభుత్వం US-కెనడా సరిహద్దులోని ట్రక్ డ్రైవర్లందరికీ కరోనా వ్యాక్సినేషన్‌(Corona Vaccine)ను తప్పనిసరి చేసింది. దీంతో కెనడాలోని ట్రక్ డ్రైవర్లు కరోనా వ్యాక్సినేషన్ వేయించుకున్న తర్వాత మాత్రమే ప్రవేశించగలరు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ట్రక్కు డ్రైవర్లలో చాలా ఆగ్రహావేశాలు కలిగాయి. ఉద్యమం బాట పట్టారు. ఈ నేపధ్యంలో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో కెనడా రాజధాని ఒట్టావాలో నిరసనలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.

ట్రక్ డ్రైవర్లు, వ్యాక్సిన్ ను వ్యతిరేకిస్తున్న వారు కలిసి సిటీ సెంటర్‌ను స్తంభింపజేశారు. దీంతో ప్రధాని ట్రూడో స్పందిస్తూ.. “మన ఆర్థిక వ్యవస్థను, మన ప్రజాస్వామ్యాన్ని, మన తోటి పౌరుల రోజువారీ జీవితాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు” అని ఆయన అన్నారు. ఒట్టావాలో ఆదివారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన అన్ని నిబంధనలు. కరోనాకు సంబంధించిన పరిమితులను పూర్తిగా రద్దు చేసే వరకు తాము నిరసన వ్యక్తం చేస్తామని నిరసనకారులు చెబుతున్నారు,

వ్యాక్సినేషన్ కు వ్యతిరేకంగా చోటు చేసుకుంటున్న ప్రదర్శనల కారణంగా..నగరం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. అంతేకాదు ఆర్థిక కార్యకలాపాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ విషయంపై ఒట్టావా పోలీస్ చీఫ్ పీటర్ స్లోగ్లీ స్పందిస్తూ.. “కెనడాలో ఎన్నడూ చూడని అపూర్వమైన నిరసన” అని.. ఈ నిరసనను ఆపడానికి అధికారులు ప్లాన్ చేయడంలో విఫలమయ్యారని అంగీకరించారు.

మరోవైపు, కెనడా రాజధాని ఒట్టావాలోని భారత హైకమిషన్ ఈ విషయంపై స్పందిస్తూ.. కెనడాలో జరుగుతున్న భారీ ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని ప్రవాసభారతీయులకు కొన్ని సూచనలు చేసింది. అక్కడ నివసిస్తున్న లేదా ఆ దేశానికి వెళ్లాలని భావిస్తున్న భారతీయ పౌరులకు మంగళవారం కొన్ని సలహాను జారీ చేసింది. ప్రదర్శనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లవద్దని భారత హైకమిషన్ భారతీయులకు సూచించింది. కర్ఫ్యూతో సహా స్థానిక అధికారుల సూచనలను పాటించాలని హైకమిషన్ భారతీయ పౌరులను కూడా కోరింది. భారతీయ పౌరులకు సహాయం అందించడానికి హై కమిషన్ హెల్ప్‌లైన్ నంబర్ (+1) 6137443751ని కూడా జారీ చేసింది.

ఆదివారం ఎమర్జెన్సీ ని ప్రకటించిన మేయర్: ఒట్టావాలో నిరసనల మధ్య ఒట్టావా మేయర్ జిమ్ వాట్సన్ ఆదివారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఫ్రంట్‌లైన్ సిబ్బందికి అవసరమైన పరికరాలను సేకరించడంలో సహాయపడే సేవలకు మినహాయింపు నిచ్చింది. అయితే ఒట్టావాలో వారాంతంలో వేలాది మంది నిరసనకారులు మళ్లీ వీధుల్లోకి వచ్చారు. గత వారం రోజుల నుంచి నగరంలో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు.

అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా రిపబ్లికన్ పార్టీకి చెందిన పలువురు నేతలు ఈ నిరసనలకు మద్దతు పలికారు. ఈ నేపధ్యంలో తమ దేశీయ వ్యవహారాల్లో అమెరికన్ గ్రూపులు జోక్యం చేసుకోవడం మానుకోవాలని కెనడాలోని అమెరికా మాజీ రాయబారి అన్నారు.

Also Read:

 ఓ మై గాడ్.. అదృష్టం అంటే ఇతనిదే.. కొంచెం తేడా అయినా ప్రాణాలే పోయేవి..