Covid 19 Deaths: ఆ 88 దేశాల్లో కరోనాతో ఎంత మంది భారతీయులు మృతి చెందారో తెలుసా? అంతులేని విషాదం..
నేడు రాజ్యసభ (Rajyasabha)లో మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచంలోని మొత్తం 88 దేశాల్లో కోవిడ్-19 కారణంగా మొత్తం..
Total No of Covid Deaths Around The World: కోవిడ్ 19 (Covid 19)మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గజ గజలాడించింది. ప్రస్తుతం దాని ఉధృతి కొంత తగ్గినా అది మిగిల్చిన విషాదం మాత్రం అంతాఇంతాకాదు. ఇక మనదేశంలో ఇప్పటికే లక్షల మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే. ఐతే దేశ విదేశాల్లో మన భారతీయులు ఎంతమంది కోవిడ్ కారణంగా మరణించారో తెలుసా? అవును.. విస్తుపోయే వాస్తవాలు ఈ రోజు వెల్లడయ్యాయి. నేడు రాజ్యసభ (Rajyasabha)లో మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచంలోని మొత్తం 88 దేశాల్లో కోవిడ్-19 కారణంగా మొత్తం 4,355 మంది భారతీయులు మరణించారు. అత్యధికంగా సౌదీ అరేబియాలో 1,237 మరణాలు నమోదు కాగా, ఆ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో 894 మరణాలు నమోదయ్యాయి. కాగా ఈ రెండు పశ్చిమాసియా దేశాల్లో ఆరు మిలియన్లకు పైగా భారతీయులు నివసిస్తున్నారు. గురువారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ అందించిన సమాచారంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అంత్యక్రియల కోసం మొత్తం 127 మృతదేహాలను భారతదేశానికి తీసుకువచ్చినట్టు మంత్రి తెలిపారు.
మంత్రి అందించిన సమాచారం ప్రకారం, పై రెండు దేశాలతోపాటు బహ్రెయిన్ (203), కువైట్ (668), మలేషియా (186), ఒమన్ (555), ఖతార్ (113) మరణాలు సంభవించాయి. విదేశాల్లో మరణించిన భారతీయుల మరణాలకు సంబంధించిన సమాచారం అందినప్పుడు స్వదేశానికి తరలించడం లేదా స్థానికంగా ఖననం చేయడానికి ఇండియన్ కమ్యునిటీ వెల్ఫేర్ ఫండ్ నుంచి సాయం అందించబడిందని మురళీధరన్ చెప్పారు.
రాజ్యసభలో అడిగిన మరొక ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ వ్రాతపూర్వకంగా ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఆయన ఏం చెప్పారంటే.. మహమ్మారి కారణంగా ఆరు పశ్చిమాసియా దేశాల నుంచి భారత్‌కు సంబంధించిన ప్రత్యేక విమానాల్లో 716,662 మంది స్వదేశానికి తిరిగివచ్చారు. వీరిలో గల్ఫ్‌లోని భారత కార్మికులు పెద్ద సంఖ్యలో తిరిగి వచ్చినట్లు మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. కోవిడ్ ఉధృతి సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడంలో గల్ఫ్ దేశాలు ఉన్నతంగా వ్యవహరించాయన్నారు.
Also Read: