DMHO East Godavari Jobs: తూ.గో- డీఎమ్‌హెచ్‌ఓలో పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు.. 3 రోజుల్లో ముగియనున్న గడువు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం (DMHO) నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ద్వారా పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
DMHO East Godavari Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం (DMHO) నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ద్వారా పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్లు: 3 స్టాఫ్ నర్సులు: 4 ల్యాబ్ టెక్నీషియన్లు: 1 డేటా ఎంట్రీ ఆపరేటర్లు: 2 ఫార్మసిస్టులు: 2
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, జీఎన్‌ఎం/బీఎస్సీ (నర్సింగ్), డిప్లొమా, ఏదైనా డిగ్రీ, ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏపీ మెడికల్/పారామెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టరయ్యి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, సర్వీస్ మెరిట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: డీఎంహెచ్ కార్యాలయం, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, ఏపీ.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 13, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: