IND vs WI: డేరింగ్ డెసిషన్స్‌కి కేరాఫ్ అడ్రస్ టీమిండియా సారథి.. చిన్న ఎరతో విండీస్ ఆట కట్టించాడు: దినేష్ కార్తీక్

అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో రెండవ వన్డేలో రోహిత్ శర్మ అండ్ కో.. సూపర్ విక్టరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. కీలక సమయంలో డేరింగ్ డెసిషన్స్ తీసుకున్న రోహిత్ శర్మ..

IND vs WI: డేరింగ్ డెసిషన్స్‌కి కేరాఫ్ అడ్రస్ టీమిండియా సారథి.. చిన్న ఎరతో విండీస్ ఆట కట్టించాడు: దినేష్ కార్తీక్
Ind Vs Wi
Follow us
Venkata Chari

|

Updated on: Feb 10, 2022 | 4:23 PM

IND vs WI: అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో రెండవ వన్డేలో రోహిత్ శర్మ(Rohit Sharma) అండ్ కో.. సూపర్ విక్టరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. కీలక సమయంలో డేరింగ్ డెసిషన్స్ తీసుకున్న రోహిత్ శర్మ.. తను కెప్టెన్సీ ఎంత కీలకమైందో నిరూపించాడని టీమిండియా వికెట్ కీపర్ కం బ్యాటర్ దినేష్ కార్తీక్ ప్రశంసించాడు. వెస్టిండీస్ ఇన్నింగ్స్ చివరిలో వాషింగ్టన్ సుందర్‌(Washington Sundar)ను బౌలింగ్‌కు తీసుకువచ్చి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడని వెల్లడించాడు. విండీస్ 36 బంతుల్లో గెలవడానికి 49 పరుగులు చేయాల్సి ఉండగా, 44వ ఓవర్‌లో మహమ్మద్ సిరాజ్ 11 పరుగులు ఇచ్చాడు. దీంతో వెంటనే రోహిత్ బంతిని సుందర్‌కి అందించాడు.

సుందర్ తన ఓవర్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అదే సమయంలో భారత శిబిరంలో వణుకు తెప్పించిన ఓడియన్ స్మిత్ వికెట్ కూడా తీశాడు. ఆ తరువాత ఓవర్‌లో వెస్టిండీస్ 193 పరుగులకు ఆలౌట్ అయింది.

ఈ మేరకు దినేష్ కార్తీక్ మాట్లాడుతూ, “ఓడియన్ స్మిత్ తుఫాన్ బ్యాటింగ్ చేస్తూ భారత శిబిరంలో వణుకు తెప్పించాడు. ఇలాంటి సమయంలో సుందర్‌ని తీసుకొచ్చిన రోహిత్ ఎత్తుగడ నాకు బాగా నచ్చింది. అది డేరింగ్ డెసిషన్. ఆఫ్ స్పిన్నర్‌ను రైట్‌హ్యాండర్‌ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రంగంలోకి దించడం చాలా ఆసక్తికరంగా ఉంది. రోహిత్ చిన్న ఎర వేసి భారీ లాభం పొందాడని” క్రిక్‌బజ్‌తో పేర్కొన్నాడు.

“సుందర్ టాలెంట్ ఏమిటంటే అతను ఒత్తిడిని తట్టుకొని బౌలింగ్ చేయడం. ఇలాంటి కీలక సమయంలో బౌలింగ్ చేయాలంటే ఎంతో నైపుణ్యం, ప్రతిభ అవసరం. అదే కెప్టెన్‌, బౌలర్‌ల మధ్య స్నేహం చిగురించేలా చేస్తుంది” అని దినేష్ కార్తీక్ అన్నాడు. అయితే, సుందర్ బౌలింగ్‌కి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పొలాక్ కూడా ఫిదా అయ్యాడు. “సుందర్‌ను రంగంలోకి దింపడం రోహిత్ ప్లాన్‌లో భాగమే కావొచ్చు. కానీ, ఇలాంటి సమయంలో రాణించాలంటే మాత్రం ఎంతో నేర్పు కావాలి. అది సుందర్ చేయగలిగాడు” అని పొలాక్ పేర్కొన్నాడు.

Also Read: IND vs WI, 3rd ODI: చివరి వన్డేలో 5 కీలక మార్పులు.. టీమిండియా ప్లేయింగ్ XI ఎలా ఉండనుందంటే?

Watch Video: ఇది కోహ్లీ స్టైల్ పుష్ప డ్యాన్స్.. ఇరగదీశావంటోన్న ఫ్యాన్స్.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో