Ajinkya Rahane: ఆస్ట్రేలియాలో నేను తీసుకున్న నిర్ణయాలకు మరొకరు క్రెడిట్ తీసుకున్నారు: మాజీ కోచ్‌పై రహానే కీలక వ్యాఖ్యలు

Team India: భారత క్రికెట్ జట్టు ఆటగాడు అజింక్యా రహానే ఫామ్‌పై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. దీనిపై తాజాగా రహానే స్పందించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

Ajinkya Rahane: ఆస్ట్రేలియాలో నేను తీసుకున్న నిర్ణయాలకు మరొకరు క్రెడిట్ తీసుకున్నారు: మాజీ కోచ్‌పై రహానే కీలక వ్యాఖ్యలు
Rahane, Pujara
Follow us
Venkata Chari

|

Updated on: Feb 10, 2022 | 6:37 PM

Ajinkya Rahane vs Ravi Shastri: భారత టెస్టు జట్టు(Team India)లో దాదాపు మార్పులు మొదలయ్యాయి. సీనియర్ ఆటగాళ్లు అజింక్యా రహానే(Ajinkya Rahane), ఛెతేశ్వర్ పుజారా ఫామ్ గురించి చాలా కాలంగా చర్చ నడుస్తోంది. టీమ్ ఇండియా మార్పును పలువురు మాజీ ఆటగాళ్లు సమర్థించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా భారత జట్టు ఆటగాళ్లు ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు. ఈ కారణంగా రహానె చాలా కాలంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఆయన దీనిపై స్పందించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

అజింక్యా రహానే యూట్యూబ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నేను చాలా విషయాలను తలచుకుని నవ్వుకుంటున్నాను. క్రికెట్ తెలిసిన వారు ఇలా మాట్లాడరు. ఆస్ట్రేలియాలో ఏం జరిగిందో, అంతకు ముందు ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. దీనిపై నేనేమీ చెప్పను. అయితే క్రికెట్‌ను అర్థం చేసుకోని వారు ఇలా మాట్లాడుతున్నారంటూ” విమర్శలకు తాళం వేశాడు.

తాజాగా రహానెను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. “నేను అక్కడ ఏం చేశానో నాకు తెలుసు. నేను ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియా సిరీస్‌లో నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. కానీ, దాని ప్రతిఫలాన్ని మరొకరు తీసుకున్నారు. నేను నా గురించి ఎక్కువగా మాట్లాడలేను. కానీ, నా నిర్ణయాలపై నాకు పూర్తి నమ్మకం ఉంది” అని పేర్కొన్నాడు.

నిజానికి, ఆ అద్భుతమైన విజయాల తర్వాత రవిశాస్త్రికి పేరొచ్చింది. MCGలోనే కాకుండా మిగిలిన నాలుగు-మ్యాచ్‌ల సిరీస్‌లో కూడా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జట్టును నడిపించిన తీరుకు రహానే క్రికెట్ ప్రేమికుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. MCG టెస్టులో ముగ్గురు కీలక ప్లేయర్లును టీమిండియా కోల్పోయింది. అలాగే గాయాల కారణంగా సిరీస్‌లో కీలక ఆటగాళ్లను కోల్పోవడం కొనసాగింది. అయితే వీటన్నింటిని దాటుకుని అద్భుత విజయం సాధించింది. అందులో రహానే సారథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకుని విజయం సాధించింది. ఎవరి పేరును ప్రస్తావించకుండానే రహానే విమర్శలు గుప్పించాడు. అయితే రవిశాస్త్రిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో టీమిండియాను విజయం దిశగా సాగించిన రహానేకు మాత్రం ఆ క్రెడిట్ దక్కలేదు.

రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి అడిలైడ్‌లో ఓటమితో నిరాశ చెందడంతో, రహానే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జట్టు పగ్గాలు చేపట్టాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో నిలిచింది. ఇందులో రహానే అద్భుతమైన సెంచరీతో పోరాటాన్ని నడిపించడంతో టెస్ట్ చరిత్రలో చూసిన అత్యంత అద్భుతమైన మలుపుల్లో ఒకటిగా నిలిచింది.

విశేషమేమిటంటే, గత సంవత్సరం అజింక్యా రహానేకు అంతగా మంచిగా లేదు. 2021 సంవత్సరంలో రెండు ఇన్నింగ్స్‌లు మినహా పెద్దగా రాణించలేదు. ఓవల్ టెస్టులో ఇంగ్లండ్‌తో జరిగిన ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 14 పరుగుల స్కోరు వద్ద పెవిలియన్‌ చేరాడు. అలాగే లీడ్స్‌లో కూడా ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. ఈ టెస్టులో రహానే 18, 10 పరుగులు చేశాడు.

Also Read: IND vs WI: డేరింగ్ డెసిషన్స్‌కి కేరాఫ్ అడ్రస్ టీమిండియా సారథి.. చిన్న ఎరతో విండీస్ ఆట కట్టించాడు: దినేష్ కార్తీక్

IND vs WI, 3rd ODI: చివరి వన్డేలో 5 కీలక మార్పులు.. టీమిండియా ప్లేయింగ్ XI ఎలా ఉండనుందంటే?