IPL 2022 Auction: ధోని నుంచి కోహ్లీ వరకు.. ఈ ఆల్ రౌండర్‌పైనే చూపు.. అత్యధిక ధర పొందే ఛాన్స్?
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేలం ఫిబ్రవరి 12, 13 తేదీలలో బెంగళూరులో జరగనుంది. ఈ ఆల్‌రౌండర్ వేలంలో భారీ మొత్తాన్ని పొందే ఛాన్స్ ఉంది.
Indian Premier League: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తదుపరి సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వేలం(IPL 2022 Mega Auction) నిర్వహించనున్నారు. దీనికి ముందు, వేలంలో ఎవర్ని కొనుగోలు చేయాలోనని అన్ని జట్లు తీవ్రంగా కసరత్తులు ప్రారంభించాయి. ఇప్పటికే ఆ మేరకు తమ లిస్టును కూడా రెడీ చేసుకున్నాయి. అయితే అన్ని జట్లు ఒకరి కోసం భారీగా స్కెచ్‌లు వేస్తున్నాయి. ఈ ఆల్ రౌండర్‌ను కొనుగోలు చేయడానికి అన్ని జట్లు పోటీపడనున్నాయి.
ఈ ఆల్ రౌండర్ ఎవరో కాదు.. జాసన్ హోల్డర్. ఐపీఎల్ 2022లో జాసన్ హోల్డర్ బేస్ ప్రైస్ రూ. 1.5 కోట్లుగా ఉంది. అయితే అన్ని జట్లు అటు బ్యాట్స్‌మెన్స్, ఇటు బౌలర్ల కోసమే కాకుండా ఆల్ రౌండర్ల వేటలోనూ నిమగ్నమయ్యాయి. ప్రస్తుత వేలంలో ఆల్ రౌండర్ల కొరత కారణంగా ఈ ఆటగాడికి అధిక ధర చెల్లించేందుకు అన్ని జట్లు ప్లాన్ చేస్తున్నాయి.
వెస్టిండీస్ మాజీ కెప్టెన్, దిగ్గజ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్‌ను కొనుగోలు చేసేందుకు అన్ని జట్లూ పందెం వేయవచ్చు. ఐపీఎల్ 2022 వేలంలో జాసన్ హోల్డర్ బేస్ ధర రూ. 1.5 కోట్లు. IPL 2022 వేలంలో అత్యధికంగా అమ్ముడయ్యే ఆటగాడిగా జాసన్ హోల్డర్ ఉండవచ్చని తెలుస్తోంది.
ఇది IPL 2021లో ప్రదర్శన.. IPL చివరి సీజన్ అంటే IPL 2021లో, జాసన్ హోల్డర్ అద్భుతంగా పని చేశాడు. టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన హోల్డర్ 16 వికెట్లు తీశాడు. ఇది కాకుండా, అతని బ్యాట్ నుంచి 85 పరుగులు కూడా వచ్చాయి. ఈ సమయంలో అతని అత్యధిక స్కోరు 47నాటౌట్‌గా నిలిచింది.
370 మంది భారతీయ, 220 మంది విదేశీ ఆటగాళ్లు వేలంలో ఉన్నారు..
IPL 2022 మెగా వేలం కోసం ఖరారు చేసిన 590 మంది ఆటగాళ్లలో 370 మంది భారతీయులు కాగా, 220 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. భారత్ తర్వాత అత్యధికంగా 47 మంది ఆటగాళ్లు ఆస్ట్రేలియా నుంచి వేలంలో నిలిచారు. 590 మంది ఆటగాళ్లలో 228 మంది ఆటగాళ్లు ఇంతకు ముందు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. అదే సమయంలో, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంకా అరంగేట్రం చేయని ఆటగాళ్లు 335 మంది ఈ వేలంలో ఉన్నారు.