Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Auction: ఆ ముగ్గురి కోసం ఎంతకైనా రెడీ అంటోన్న కోహ్లీ టీం.. వేలంలో వారిపై కాసుల వర్షమే!

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ జరగనుంది. ఈ వేలంలో అత్యధిక ధర పలికే ఆటగాడు ఎవరవుతరాన్న దానిపై ఇప్పుడు చర్చ...

IPL 2022 Auction: ఆ ముగ్గురి కోసం ఎంతకైనా రెడీ అంటోన్న కోహ్లీ టీం.. వేలంలో వారిపై కాసుల వర్షమే!
Ipl 2022 Auction
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 10, 2022 | 7:43 PM

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ జరగనుంది. ఈ వేలంలో అత్యధిక ధర పలికే ఆటగాడు ఎవరవుతరాన్న దానిపై ఇప్పుడు చర్చ కొనసాగుతోంది. ఇక ఈ రేసులో ఇషాన్ కిషన్ , యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, శ్రేయాస్ అయ్యర్, డేవిడ్ వార్నర్, జాసన్ హోల్డర్‌, అన్‌క్యాప్డ్ ప్లేయర్ షారుక్ ఖాన్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఇది ఐదో మెగా వేలం కాగా.. ఇందులో ఈసారి 10 జట్లు పాల్గొనబోతున్నాయి. గత ఐపీఎల్ మెగా వేలంలో నలుగురు ఆటగాళ్లు రూ.10 కోట్లు దాటగా.. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉంటే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముగ్గురు ప్లేయర్స్‌పై గురి పెట్టింది. శ్రేయాస్ అయ్యర్, డేవిడ్ వార్నర్, జాసన్ హోల్డర్‌లపై కాసుల వర్షం కురిపించేందుకు సిద్దమైంది. ఇక ఒకసారి పైన పేర్కొన్న ఆరుగురి ప్లేయర్స్ ప్రొఫైల్స్‌ను పరిశీలిస్తే..

శ్రేయాస్ అయ్యర్:

మార్క్యూ ప్లేయర్లలో ఒకడైన శ్రేయాస్ అయ్యర్.. బేస్ ధర రూ.2 కోట్లు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా అయ్యర్‌కు ఐపీఎల్‌లో అపారమైన అనుభవం ఉంది. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌కు సారధిగా వ్యవహరించిన శ్రేయాస్ అయ్యర్.. ఆ సీజన్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2015 బ్యాటర్‌గా శ్రేయాస్ అయ్యర్‌కు ఉత్తమమైన సీజన్‌ అని చెప్పొచ్చు. ఆ సీజన్‌లో 437 పరుగులు చేసి ఎమర్జింగ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ఈ వేలంలో శ్రేయాస్ అయ్యర్ అత్యధిక ధర పలికే అవకాశం ఉంది. ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్, కేకేఆర్ జట్లకు కెప్టెన్లు లేరు. వీరు అయ్యర్‌పై గురి పెట్టగా.. బెంగళూరు జట్టు శ్రేయాస్ అయ్యర్‌ను దక్కించుకునేందుకు ఏకంగా రూ. 20 కోట్లు పక్కన పెట్టిందని టాక్ నడుస్తోంది.

డేవిడ్ వార్నర్: 

ఎడమ చేతి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్. రూ.2 కోట్లు బేస్ ధర. మార్క్యూ ప్లేయర్లలో ఒకడు. ఆస్ట్రేలియా జట్టులో కీలక బ్యాటర్‌ అయిన డేవిడ్ వార్నర్‌కు ఐపీఎల్‌లో అద్భుత గణాంకాలు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన విదేశీ ఆటగాడిగా వార్నర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన వార్నర్.. ఆ జట్టుకు 2016లో ట్రోఫీని అందించాడు. ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన వార్నర్‌ను బెంగళూరు జట్టు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. కెప్టెన్‌గా చేయాలని చూస్తోంది. ఇందుకోసం కాసులు కురిపించనుందట.

ఇషాన్ కిషన్:

ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్. రూ.2 కోట్లు బేస్ ధర. ఈ యువ ఆటగాడు ఈసారి వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడు కావొచ్చు. ఆర్డర్ ఏదైనా కూడా ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడగలడు. భారీ సిక్సర్లు కొట్టగలడు. చివరిసారిగా ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్‌ను రూ.6.2 కోట్లకు కొనుగోలు చేయగా.. ఈసారి ఇషాన్ రూ.14 కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉందని క్రికెట్ పండితుల టాక్.

దీపక్ చాహర్: స్వింగ్ బౌలర్, రూ. 2 కోట్లు బేస్ ధర. లోయర్ ఆర్డర్‌లో పరుగులు సాధించగల సత్తా ఉన్న బౌలింగ్ ఆల్‌రౌండర్. చెన్నై సూపర్ కింగ్స్‌ను రెండుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టడంలో దీపక్ చాహర్ పాత్ర కూడా ఉంది. ఇటీవల కాలంలో వన్డే క్రికెట్‌లో లోయర్‌ ఆర్డర్‌లో చెప్పుకోదగ్గ పరుగులు సాధించాడు దీపక్ చాహార్. 2018 నుంచి పవర్‌ప్లేలో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా అవతరించాడు.

జాసన్ హోల్డర్:

వెస్టిండీస్ మాజీ కెప్టెన్, దిగ్గజ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్‌ను కొనుగోలు చేసేందుకు అన్ని జట్లూ పందెం వేయవచ్చు. ఐపీఎల్ 2022 వేలంలో జాసన్ హోల్డర్ బేస్ ధర రూ. 1.5 కోట్లు. IPL 2022 వేలంలో అత్యధికంగా అమ్ముడయ్యే ఆటగాడిగా జాసన్ హోల్డర్ ఉండవచ్చని తెలుస్తోంది. అతడి కోసం రూ.12 కోట్ల వరకు వెచ్చించాలని ఆర్సీబీ నిర్ణయించినట్లు సమాచారం.

యుజ్వేంద్ర చాహల్: 

లెగ్ స్పిన్నర్. రూ.2 కోట్లు బేస్ ధర. ఐపీఎల్ 2014 తర్వాత యుజ్వేంద్ర చాహల్ 139 వికెట్లు పడగొట్టాడు. అప్పటి నుంచి అతడే టోర్నీలో అత్యధిక వికెట్ టేకర్. ఏది ఏమైనప్పటికీ, వేలంలో చాలా తక్కువ మంది లెగ్ స్పిన్నర్లు ఉన్నారు. కాబట్టి చాహల్ ఎక్కువ ధర పలికే అవకాశం ఉంది.

షారుక్ ఖాన్:

అన్‌క్యాప్డ్ ప్లేయర్. రూ.40 లక్షలు బేస్ ధర. ఫినిషర్‌గా మంచి ట్రాక్ రికార్డు. విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ లాంటి దేశవాళీ టోర్నమెంట్స్‌లో క్లిష్టమైన మ్యాచ్‌ల్లో తనదైన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. దీనితో ఇతగాడు ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికే ఛాన్స్ ఉంది.