IPL 2022 Auction: ఈ ఏడాది ఆడడు.. అయినా కోట్లల్లో పందెం వేసేందుకు సిద్ధమైన జట్లు.. ఆ ‘రహస్య బిడ్లు’ ఎవరిపైనంటే?

IPL 2022 Auction: ఈ ఏడాది ఆడడు.. అయినా కోట్లల్లో పందెం వేసేందుకు సిద్ధమైన జట్లు.. ఆ 'రహస్య బిడ్లు' ఎవరిపైనంటే?
Ipl 2022 Mega Auction Jofra Archer Tie Breaker Rule

జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 2022లో ఆడటం చాలా కష్టం. కానీ, అతనిని జట్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రహస్య వేలానికి (IPL 2022 Auction) లోబడి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Venkata Chari

|

Feb 10, 2022 | 9:18 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 మెగా వేలానికి (IPL 2022 Auction) సమయం ఆసన్నమైంది. శనివారం, మొత్తం 10 IPL జట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేసేందుకు సిద్దమయ్యాయి. రెండు రోజుల పాటు బెంగళూరు వేదికగా సాగే ఈ బిడ్‌లో పలువురు ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిపించనుండగా.. మరికొంత మంది ఆటగాళ్లు నిరాశ చెందాల్సి వస్తుంది. ఐపిఎల్ 2022లో ఆడని ఆటగాడు వారిలో ఉన్నప్పటికీ, పలుజట్లు అతనిపై భారీగా పందెం వేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) గురించి పలు వార్తలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఆటగాడి బేస్ ప్రైజ్ రూ. 2 కోట్లుగా ఉంది. రహస్య బిడ్డింగ్ ద్వారా అతను ఐపిఎల్ వేలంలో (IPL 2022) పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అసలేంటి ఈ రహస్య కోట్? ఈ బౌలర్ అందుబాటులో లేనప్పుడు ఇతర జట్లు ఎందుకు కొనుగోలు చేస్తాయి? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న.

ఐపీఎల్ సైలెంట్ టై బ్రేకర్ నిబంధన ప్రకారం జోఫ్రా ఆర్చర్‌ను కొనుగోలు చేయవచ్చని విశ్వసిస్తున్నారు. ఆర్చర్ మోచేతికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ సీజన్‌లో ఆడడు. కానీ, అతని పేరును వేలంలో ఉంచాడు. 2020లో అతను రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా కూడా ఎంపికయ్యాడు. అన్ని జట్లు ఈ ఆటగాడిపై ఆసక్తి చూపడానికి బహుశా ఇదే కారణం కావచ్చు. ప్రస్తుత సీజన్‌లో మరో విధంగా ఈ ఆటగాడు అమ్ముడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

జోఫ్రా ఆర్చర్ సైలెంట్ టై బ్రేకర్‌లో అమ్ముడవుతుడా? 2010లో ఐపీఎల్‌లో టై బ్రేకర్ నిబంధన వచ్చింది. అది షార్ట్ వేలం కోసం అమలు చేయనున్నారు. దీని ప్రకారం, ఒక జట్టు ఒక ఆటగాడిని కొనుగోలు చేయాలనుకుంటే, వారి పర్స్ డబ్బు అయిపోయే వరకు వేలం వేస్తూ ఉంటే, అప్పుడు టై బ్రేకర్ నియమం వర్తిస్తుంది. దీని కింద జట్లు ఆ ఆటగాడికి రహస్య బిడ్ వేయాల్సి ఉంటుంది. బిడ్ ఎక్కువగా ఉన్న జట్టుకు ఆ ఆటగాడు సొంతం అవుతాడు. అయితే, ఆటగాడికి పర్స్ డబ్బు మాత్రమే వస్తుంది. అదనపు మొత్తం బీసీసీఐ ఖాతాకు వెళ్తుంది. 2010లో కీరన్ పొలార్డ్, షేన్ బాండ్‌లకు ఇదే జరిగింది. 2012లో రవీంద్ర జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ ఇదే విధంగా కొనుగోలు చేసింది. ఆర్చర్‌కి కూడా అలాంటిదే జరగవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

జోఫ్రా ఆర్చర్ చివరి క్షణాల్లో వేలంలోకి ఎంట్రీ.. జోఫ్రా ఆర్చర్ కోసం IPL వేలం రెండవ రోజు చివరి స్టాప్‌లో జట్లు పందెం వేయవచ్చు. ఈ సమయానికి అన్ని జట్ల పర్స్‌లో ఎక్కువ డబ్బు మిగిలి ఉండదు. ఆపై ఈ బౌలర్‌ను టై బ్రేకర్ నియమం ప్రకారం కొనుగోలు చేయవచ్చు. ప్రశ్న ఏమిటంటే, జోఫ్రా ఆర్చర్‌ను కొనుగోలు చేయడం లాభదాయకమైన ఒప్పందమా? సమాధానం అవుననే చెప్పాలి. ఎందుకంటే ఆర్చర్ పేస్, అతని లైన్-లెంగ్త్ అద్భుతంగా ఉన్నాయి. అతను ఈ సంవత్సరం ఆడకపోతే, తదుపరిసారి వచ్చి తన ఫ్రాంచైజీ కోసం చాలా మ్యాచ్‌లను గెలవగలడు. ఆర్చర్ ఒక మ్యాచ్ విన్నింగ్ బౌలర్, అతనిని కొనుగోలు చేయడానికి జట్లు ఖచ్చితంగా ఆలోచిస్తాయి.

Also Read: IPL 2022 Auction: ఆ ముగ్గురి కోసం ఎంతకైనా రెడీ అంటోన్న కోహ్లీ టీం.. వేలంలో వారిపై కాసుల వర్షమే!

IPL 2022 Auction: ధోని నుంచి కోహ్లీ వరకు.. ఈ ఆల్ రౌండర్‌పైనే చూపు.. అత్యధిక ధర పొందే ఛాన్స్?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu