IND vs WI, 3rd ODI: చివరి వన్డేలో 5 కీలక మార్పులు.. టీమిండియా ప్లేయింగ్ XI ఎలా ఉండనుందంటే?

భారత్, వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ శుక్రవారం, ఫిబ్రవరి 11న అహ్మదాబాద్ మైదానంలో జరగనుంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న రోహిత్ & కో..

IND vs WI, 3rd ODI: చివరి వన్డేలో 5 కీలక మార్పులు.. టీమిండియా  ప్లేయింగ్ XI ఎలా ఉండనుందంటే?
Team India Possible Playing 11 Vs West Indies
Follow us
Venkata Chari

|

Updated on: Feb 10, 2022 | 3:20 PM

Team India Possible Playing 11 Vs West Indies: భారత్, వెస్టిండీస్(IND vs WI) మధ్య మూడు వన్డేల సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ శుక్రవారం, ఫిబ్రవరి 11న అహ్మదాబాద్ మైదానంలో జరగనుంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న రోహిత్ & కో.. చివరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. మూడో వన్డేలో కెప్టెన్ రోహిత్(Rohit Sharma), ద్రవిడ్ పలు కీలక మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. మూడో మ్యాచ్‌లో భారత జట్టు ఏ 11 మంది ఆటగాళ్లతో మైదానంలోకి దిగనుందో ఇప్పుడు చూద్దాం.

ఓపెనింగ్ పెయిర్.. మూడో వన్డే మ్యాచ్‌లో, టీమిండియా ఓపెనింగ్ జోడిలో మార్పు ఉండవచ్చు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్‌తో కలిసి శిఖర్ ధావన్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. కరోనా కారణంగా ధావన్ మొదటి మ్యాచ్ ఆడలేకపోయాడు. అతనికి రెండవ మ్యాచ్‌లో అవకాశం లభించలేదు. అయితే మూడవ మ్యాచ్‌లో ధావన్‌కు అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. తొలి మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ ఓపెనర్‌గా విఫలమయ్యాడు. అదే సమయంలో రెండో మ్యాచ్‌లో పంత్‌కు బ్యాటింగ్‌ బాధ్యతలు అప్పగించినా.. భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ధావన్ జట్టులో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది.

మూడొ స్థానంలో.. 3వ స్థానంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్ బ్యాటింగ్ చేయనున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో విరాట్‌ బ్యాట్‌తో చాలా నిరాశపరిచాడు. తొలి వన్డేలో 8 పరుగులకే ఔట్ కాగా, రెండో మ్యాచ్‌లో 18 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్ చివరి మ్యాచ్‌లోనైనా ఫాంలోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

వికెట్ కీపర్‌ స్థానంలోనూ మార్పు.. 4వ ర్యాంక్‌లో కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావొచ్చు. ఇక వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. రెండో మ్యాచ్‌లో రాహుల్ 48 బంతుల్లో 49 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇక సూర్య కుమార్ కూడా క్లిష్ట పరిస్థితుల్లో 64 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తొలి మ్యాచ్‌లో సూర్యకుమార్ 34 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను ముగించాడు.

వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను ప్రయత్నించే ఛాన్స్ ఉంది. ఇషాన్ కూడా తొలి మ్యాచ్‌లో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అదే సమయంలో పంత్ మొదటి రెండు మ్యాచ్‌లలో 14.50 సగటుతో 29 పరుగులు మాత్రమే చేయగలిగాడు. పంత్ చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో నిరంతరం ఆడుతున్నాడు. కాబట్టి అతనికి విశ్రాంతి కూడా ఇవ్వవచ్చని తెలుస్తోంది.

స్పిన్ విభాగంలో.. యుజ్వేంద్ర చాహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను చూడవచ్చు. కుల్దీప్ వన్డే జట్టులోకి తిరిగి రానున్నాడు. ప్రస్తుతం సిరీస్ గెలిచిన తర్వాత కుల్దీప్ ఆడే అవకాశం పొందవచ్చు. చాహల్ తొలి రెండు మ్యాచ్‌ల్లో 5 వికెట్లు పడగొట్టడంతో విశ్రాంతి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరో స్పిన్నర్ పాత్రను వాషింగ్టన్ సుందర్ పోషించగలడు. సుందర్ తొలి రెండు మ్యాచ్‌ల్లో 4 వికెట్లు కూడా తీశాడు.

పేస్ అటాక్‌లో కూడా కీలక మార్పులు.. ఫాస్ట్ బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్ స్థానంలో అవేష్ ఖాన్, శార్దూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చాహర్‌లకు అవకాశం లభిస్తుంది. అవేష్ దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. సిరాజ్‌ను భర్తీ చేసే అవకాశం ఉంది. అవేష్ తన పేస్ బౌలింగ్‌తో ఓపెనింగ్ ఓవర్లలో వికెట్లు తీయడంలో ప్రావీణ్యం పొందాడు. ఒకవేళ అతను మూడో వన్డేలో ఆడితే, ఈ మ్యాచ్ అతనికి వన్డే అరంగేట్రం అవుతుంది.

శార్దూల్ కూడా కంటిన్యూగా క్రికెట్ ఆడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో చాహర్‌కు మరో అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచ్‌లో దీపక్ చాహర్ 54 పరుగులతో రెండు వికెట్లు పడగొట్టాడు. మూడో పేసర్‌గా ప్రసీద్ధ్ కృష్ణ జట్టులో కొనసాగవచ్చు. రెండో వన్డేలో కృష్ణ 4 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

3వ వన్డేకు భారత ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, అవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రసీద్ధ్ కృష్ణ.

Also Read: Watch Video: ఇది కోహ్లీ స్టైల్ పుష్ప డ్యాన్స్.. ఇరగదీశావంటోన్న ఫ్యాన్స్.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

IPL 2022: మెగా వేలంలో 220 మంది విదేశీ ఆటగాళ్లు.. అదృష్టం ఎవరిని వరించేనో.. పూర్తి జాబితా ఇదే..!