Watch Video: ఇది కోహ్లీ స్టైల్ పుష్ప డ్యాన్స్.. ఇరగదీశావంటోన్న ఫ్యాన్స్.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
Trending Video: వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ ఒడియన్ స్మిత్ క్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ.. అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్‌కు తనదైన శైలిలో డ్యాన్స్‌తో ఆకట్టుకున్నాడు.
Virat Kohli Pushpa Dance: అల్లు అర్జున్ ‘పుష్ప’(Pushpa) సినిమాలోని శ్రీవల్లి హుక్ స్టెప్ క్రికెటర్లకు బాగా నచ్చుతోంది. ఈ స్టెప్‌కు తమదైన శైలిలో నెట్టింట్లో ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ లిస్టులో ఎంతోమంది క్రికెటర్లు తమ టాలెంట్ చూపించి ఆకట్టుకున్నారు. తాజాగా ఈ స్టెప్ జాబితాలో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) పేరు కూడా చేరింది. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఓడిన్ స్మిత్ ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్‌ను పట్టుకున్న కోహ్లీ.. శ్రీవల్లి పాటలోని హుక్ స్టెప్‌ను తనదైన శైలిలో కాపీ చేశాడు. విరాట్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అవుతోంది. ఈ డ్యాన్స్ చూసిన నెటిజన్లు కూడా ఇరగదీశావంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు మాత్రమే చేయగలిగింది. 238 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ ఒడియన్ స్మిత్ 2 సిక్సర్లు బాది భారత శిబిరంలో టెన్షన్ వాతావరణం సృష్టించాడు. 45వ ఓవర్లో విరాట్ కోహ్లీ ఓడియన్ స్మిత్ క్యాచ్ పట్టి భారత్ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. ఈ ఆనందంలో కోహ్లీ తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. పుష్ప సినిమాలోని శ్రీ వల్లి హుక్ స్టెప్ ని తనదైన శైలిలో చేసి నెట్టింట్లో సందడి చేస్తున్నాడు. కోహ్లీ డ్యాన్స్ చూసి కెప్టెన్ రోహిత్ శర్మ కూడా నవ్వుకున్నాడు.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో వికెట్ తీసిన డ్వేన్ బ్రేవో అల్లు అర్జున్ సినిమా’పుష్ప’లోని శ్రీవల్లి హుక్ స్టెప్‌ని తనదైన శైలిలో చేసి ఆకట్టుకున్నాడు. కోహ్లీ కంటే ముందు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్, భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా, బంగ్లాదేశ్ స్పిన్నర్ నజ్ముల్ ఇస్లాం కూడా ఇదే పాటను అనుకరించారు. వార్నర్, సురేష్ రైనా తమ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో నెట్టింట్లో రచ్చ చేశారు. మరోవైపు, కొమిల్లా విక్టోరియన్స్‌పై షోహిదుల్ ఇస్లాం వికెట్ తీసిన తర్వాత, నజ్ముల్ ఇస్లాం, అల్లు అర్జున్ స్టైల్‌ను అనుకరించి ఆకట్టుకున్నాడు.
సిరీస్ భారత్ కైవసం.. 3 వన్డేల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. భారత్ తొలి, రెండవ వన్డేల్లో విజయం సాధించి 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు మాత్రమే చేయగలిగింది. 238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు 46 ఓవర్లలో 193 పరుగులకే ఆలౌటైంది. ప్రసిద్ధ్ కృష భారత విజయంలో కీలక సహకారం అందించాడు. 9 ఓవర్లలో 12 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో సూర్యకుమార్ యాదవ్ కూడా 64 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
Kohli bhai ❤?pic.twitter.com/k7EvIjyftC
— Kartik Tripathi (@ImKartik05) February 9, 2022
Also Read: IPL 2022: మెగా వేలంలో 220 మంది విదేశీ ఆటగాళ్లు.. అదృష్టం ఎవరిని వరించేనో.. పూర్తి జాబితా ఇదే..!