Cricket Video: క్రికెట్‌లో ఇదేం పద్ధతి.. లాస్ట్ బాల్‌కు ఇలా చేస్తారా..! సిడ్నీ తీరుపై నెటిజన్లు ఫైర్..(వీడియో)
ఆస్ట్రేలియాలో జరుగుతున్నక బిగ్‌బాష్ లీగ్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ప్లేఆఫ్స్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్, సిడ్నీ సిక్సర్స్ జట్లు ఫైనల్ బెర్తు కోసం తలపడ్డాయి. ఈ సందర్భంగా మ్యాచ్ చివరి బంతికి ముందు సిడ్నీ సిక్సర్స్ జట్టు అనూహ్య రీతిలో ప్రవర్తించింది.
ఆస్ట్రేలియాలో జరుగుతున్నక బిగ్‌బాష్ లీగ్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ప్లేఆఫ్స్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్, సిడ్నీ సిక్సర్స్ జట్లు ఫైనల్ బెర్తు కోసం తలపడ్డాయి. ఈ సందర్భంగా మ్యాచ్ చివరి బంతికి ముందు సిడ్నీ సిక్సర్స్ జట్టు అనూహ్య రీతిలో ప్రవర్తించింది. దీంతో ఇప్పుడది చర్చనీయాంశంగా మారింది. సిడ్నీ సిక్సర్స్ ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో హెడెన్ కెర్ 98 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. స్ట్రైకింగ్‌లోనూ అతనే ఉండడంతో సిడ్నీ సిక్సర్స్ ఈజీగానే విజయం సాధిస్తుందనుకున్నారు. అయితే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న జోర్డాన్ సిల్క్ గాయపడ్డాడు. ఆఖరి బంతి తర్వాత ఎలాగో పెవిలియన్ చేరాల్సి ఉంటుంది. అయితే ఆఖరి బంతికి ముందు గాయపడిన సిల్క్‌ను రిటైర్డ్‌హర్ట్‌గా వెనక్కిపిలిచి అతని స్థానంలో జే లెంటన్‌ను నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌కు పిలిచారు.అయితే, ఆఖరి బంతికి సిడ్నీ జట్టు అలా బ్యాట్స్‌మన్‌ను మార్చడం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. తాము క్రికెట్ నిబంధనల మేరకే ప్రవర్తించామని సిడ్నీ జట్టు చెబుతుండగా.. అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని పలువురు క్రికెట్ అభిమానులు వాదిస్తున్నారు. గాయంతో ఇబ్బంది పడే ఆటగాడిని మార్చడం నిబంధనల ప్రకారమే అయినా అది క్రీడాస్ఫూర్తికి తగినట్లుగా లేదని కామెంట్స్ చేస్తున్నారు.
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

