AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika: క్యూట్‌ సెల్ఫీ ఫోటోను పోస్ట్‌ చేసిన రష్మిక.. వైరల్‌గా మారిన సమంత రియాక్షన్‌..

Rashmika: సినిమాల పరంగా నటీ,నటుల మధ్య పోటీ ఉంటుండొచ్చు కానీ బయట మాత్రం చాలా మంది మంచి స్నేహితులుగా ఉంటారు. హీరోయిన్లు కూడా దీనికి మినహాంపు కాదు, మరీముఖ్యంగా ఈతరం నటీమణులు మంచి ఫ్రెండ్స్‌గా మారుతున్నారు. సోషల్‌ మీడియాలో ఒకరి పోస్టులకు మరొకరు..

Rashmika: క్యూట్‌ సెల్ఫీ ఫోటోను పోస్ట్‌ చేసిన రష్మిక.. వైరల్‌గా మారిన సమంత రియాక్షన్‌..
Rashmika Samantha
Narender Vaitla
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 10, 2022 | 5:11 PM

Share

Rashmika: సినిమాల పరంగా నటీ,నటుల మధ్య పోటీ ఉంటుండొచ్చు కానీ బయట మాత్రం చాలా మంది మంచి స్నేహితులుగా ఉంటారు. హీరోయిన్లు కూడా దీనికి మినహాంపు కాదు, మరీముఖ్యంగా ఈతరం నటీమణులు మంచి ఫ్రెండ్స్‌గా మారుతున్నారు. సోషల్‌ మీడియాలో ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన పోస్ట్‌ చేసిన ఓ సెల్ఫీ ఫోటోకు అందాల తార సమంత రిప్లై ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. రష్మిక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సెల్ఫీ ఫోటోను పోస్ట్‌ చేసింది. ఇందులో రష్మిక పింక్‌ కలర్‌ జర్కిన్‌ను ధరించి మిర్రర్‌ ముందు నిల్చొని ఉంది. ఈ ఫోటోలో రష్మిక ఎక్స్‌ప్రెషన్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ అమ్మడు ఫోటోను ఇలా పోస్ట్‌ చేసిందో లేదో.. వెంటనే లైక్‌ల వర్షం కురిసింది. పోస్ట్‌ పెట్టిన కేవలం కొన్ని గంటల్లోనే 24 లక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి. ఇక కామెంట్లు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే సహనటి సమంత కూడా రష్మిక ఫోటోకు కామెంట్ చేయడం విశేషం. రష్మిక స్పందిస్తూ ‘క్యూట్‌’ అనే క్యాప్షన్‌తో పాటు లవ్‌ స్మైలీ ఎమోజీని పోస్ట్ చేసింది. దీంతో సమంత కామెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే ఇటీవల వీరిద్దరూ ఒకే సినిమాలో నటించింది. రష్మిక హీరోయిన్‌గా తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాలో సమంత కూడా స్పెషల్‌ సాంగ్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Rashmika

ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్మిక, సమంతలు ఇద్దరూ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. పుష్పతో భారీ విజయాన్ని అందుకున్న రష్మిక తెలుగులో ‘ఆడవారు మీకు జోహార్లు’, ‘పుష్ప’ సీక్వెల్‌లో నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌లోనూ మిషన్‌ మజ్నూ, గుడ్‌బై సినిమాలతో బిజీగా ఉంది. ఇక సామ్‌ విషయానికొస్తే.. ఇప్పటికే శాకుంతలం పూర్తి చేసిన భౄమ, యశోదతో పాటు ఓ హాలీవుడ్‌ చిత్రానికి కూడా సైన్‌ చేసిన విషం తెలిసిందే. వీటితో పాటు బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు లైన్‌లో పెట్టే పనిలో పడిందీ చిన్నది.

Also Read: Great Khali: ఎన్నికల వేల బీజేపీలో చేరిన మహా బలుడు.. ప్రధాని మోడీపై ది గ్రేట్ ఖలీ ప్రశంసలు..

Mahesh babu-Namratha: అన్యోన్య దాంపత్యంకు నిదర్శనం.. సతిసమేతంగా సూపర్ స్టార్

Ranu Mondal: శ్రీవల్లి సాంగ్ లోని అల్లు అర్జున్ హుక్ స్టెప్ ని అనుకరించిన రాను మండల్.. వద్దు బాబోయ్ అంటున్న నెటిజన్లు..