AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranu Mondal: శ్రీవల్లి సాంగ్‌కు రాను మండల్ స్టెప్పులు.. షేకవుతున్న ఇంటర్నెట్

Ranu Mondal:అల్లు అర్జున్‌(Allu Arjun) , రష్మిక(Rashmika) హీరో, హీరోయిన్లుగా సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా రిలీజై.. ఇప్పటికి నెల దాటినా.. సినిమామీద ఉన్న క్రేజ్ ఇంకా ఎక్కడా తగ్గలేదు..

Ranu Mondal: శ్రీవల్లి సాంగ్‌కు రాను మండల్ స్టెప్పులు.. షేకవుతున్న ఇంటర్నెట్
Ranu Mondal Dances To Srivalli Song
Surya Kala
| Edited By: Ram Naramaneni|

Updated on: Feb 11, 2022 | 1:42 PM

Share

Ranu Mondal:అల్లు అర్జున్‌(Allu Arjun) , రష్మిక(Rashmika) హీరో, హీరోయిన్లుగా సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా రిలీజై.. ఇప్పటికి నెల దాటినా.. సినిమామీద ఉన్న క్రేజ్ ఇంకా ఎక్కడా తగ్గలేదు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ కు అల్లు అర్జున్ హుక్ స్టెప్ కు దేశ విదేశాల్లోని సెలబ్రేటీల నుంచి సామాన్యుల వరకూ ఫిదా అయ్యారు. బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెటర్లు పుష్ప పాటలకు డ్యాన్స్ చేస్తున్న వీడియోలను, ఐకానిక్ డైలాగ్‌లకు లిప్ సింక్ చేస్తూ షేర్ చెస్తూ సందడిపాటలు పాడుతూ ఒక్కరోజుకే స్టార్ సింగర్ గా ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించిన రాను మోండల్ తాజాగా శ్రీవల్లికి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఈ వీడియో ఫిబ్రవరి 4న యూట్యూబ్‌లో షేర్ చేయబడింది. అయితే సోషల్ మీడియాలో క్రేజీ వైరల్‌గా మారిన యూట్యూబ్‌లోని ఈ వీడియో క్లిప్‌కి 7 లక్షలకు పైగా వీక్షణలు సొంతం చేసుకుంది. అయితే, రాను మోండల్‌ .. శ్రీవల్లి సాంగ్ కు వేసిన స్టెప్స్ కుదరలేదు.. దీంతో రాను మండల్ ప్రయత్నం నెటిజన్ల ప్రశంసలను అందుకోలేదు. సరికదా విమర్శలను సొంతం చేసుకుంది.

ఈ వీడియోలో రాను మండల్ చేతిలో కర్రను పట్టుకుని అల్లు అర్జున్.. శ్రీవల్లి సాంగ్ లో వేసిన హుక్ స్టెప్‌ను అనుకరించడానికి ప్రయత్నించింది. అయితే ఏడాది వయసున్న చిన్నారి కూడా ఈ హుక్ స్టెప్ ను సుపర్బ్ గా నెటిజన్లను ఆకట్టుకుంటే.. రాను మండల్ హుక్ స్టెప్స్ మాత్రం సరిగా లేవు.. దీంతో ఆమెను పలువురు విమర్శించారు. ఏమిటా డ్యాన్స్.. బాగోలేదు.. మజాక్ చేస్తున్నావా ఏమిటి అంటూ కొందరు… అమ్మా అపు నువ్వు స్టెప్స్ వేస్తుంటే చూడలేకపోతున్నామని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం రాను మండల్ ప్రయతనాన్ని మెచ్చుకున్నారు.

Also Read:

Bhishma Ekadashi: భీష్మ ఏకాదశి విశిష్టత.. ఈ పర్వదినం రోజున విష్ణు సహస్రనామాలు చదివితే కలిగే అద్భుత ఫలితం..