Bhishma Ekadashi: భీష్మ ఏకాదశి విశిష్టత.. ఈ పర్వదినం రోజున విష్ణు సహస్రనామాలు చదివితే కలిగే అద్భుత ఫలితం..

Bhishma Ekadashi: కార్తీక మాసం(Karthika Masam)లోని దీపానికి ఎంత విశిష్టత ఉందో.. మాఘమాసం(Magha Masam)లో చేసే స్నానానికి కూడా అంత విశిష్టత ఉంది. ఈ మాసంలోని ప్రతి రోజూ పవిత్రమైన రోజుగా..

Bhishma Ekadashi: భీష్మ ఏకాదశి విశిష్టత.. ఈ పర్వదినం రోజున విష్ణు సహస్రనామాలు చదివితే కలిగే అద్భుత ఫలితం..
Saphala Ekadashi
Follow us
Surya Kala

|

Updated on: Feb 10, 2022 | 12:29 PM

Bhishma Ekadashi: కార్తీక మాసం(Karthika Masam)లోని దీపానికి ఎంత విశిష్టత ఉందో.. మాఘమాసం(Magha Masam)లో చేసే స్నానానికి కూడా అంత విశిష్టత ఉంది. ఈ మాసంలోని ప్రతి రోజూ పవిత్రమైన రోజుగా హిందువులు భావిస్తారు. ఇక ఈ మాసంలో వచ్చే పర్వదినాల్లో ఒకటి భీష్మ ఏకాదశి. ఈ మాసంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు అంపశయ్య మీదన ఉన్న సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన పరమ పవిత్రమైన రోజు ఈ భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం, ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం.

భీష్మ ఏకాదశి విశిష్టత:

భీష్ముడు గంగా, శంతనుల ఎనిమిదవ సంతానం. అసలు పేరు దేవవ్రతుడు. తండ్రి శంతనుడు ఇష్టపడిన సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయడం కోసం తండ్రి ఆనందం కోసం, సుఖసంతోషాల కోసం దేవవ్రతుడు… ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని పెళ్లి అనే మాటకు తన జీవితంలో చోటు లేదని సత్యవతికి మాట ఇచ్చి.. ఆ భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి. అప్పటి నుంచి దేవవ్రతుడు భీష్ముడిగా ఖ్యతిగాంచాడు. తనయుడి త్యాగానికి సంతసించిన తండ్రి.. భీష్ముడికి స్వచ్చంద మరణం పొందే వరాన్ని ఇచ్చాడు.

కౌరవుల తరపున కురుక్షేత్ర రణక్షేత్రంలో యుద్దాన్నికి దిగిన భీష్ముడు.. శ్రీకృష్ణుడు స్వయంగా జరిపించిన ఆహ్వ యజ్ఞాన్ని … ఒంటిచేత్తో పదిరోజులు నడిపించిన ధనుర్విద్యా పితామహుడు భీష్ముడు. భీష్మ ధనునిర్విధ్యకు అర్జునుడు, శ్రీకృష్ణుడు కూడా నిశ్చేష్టులయ్యారు. అధర్మపక్షాన నిలబడి, ధర్మంతో పోరుకు సిద్ధపడినప్పుడే “భీష్ముడు” మరణాన్ని స్వాగతించాడు. అదే, తన అసమర్థతకు శిక్ష అని భావించి అర్జునుడు బాణాలకు గాయపడిన భీష్ముడు అంపశయ్యపైకి చేరుకొని.. మరణించే మంచి సమయం కోసం ఎదురు చూస్తూ.. పాండవులకు రాజ్య ధర్మం ఉపదేశించడమే కాదు.. ధర్మ రాజుకి విష్ణుసహస్రనామాలను పదేశించారు. అంపశయ్యగతుడైన భీష్ముని చూసి దేవతలు సైతం దుఃఖించారు. 58 రోజులు అంపశయ్యపై ఉన్న భీష్ముడు మరణ వేదనను అనుభవిస్తూ… మానవజన్మకు మహత్తర వరమైన మరణం కోసం, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ గడిపాడు భీష్ముడు.

ధర్మ రాజు సందేహానికి సమాధానంగా లీలా మానుష విగ్రహుడైన ఈ శ్రీకృష్ణుడే… జగత్ ఏభుం దేవదేవమనంతం పురుషోత్తమం” అంటూ ప్రారంభించి, “విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు:” అంటూ విష్ణసహస్రనామావళిని వేయి విధాలుగా కీర్తిస్తూ, విశ్వకళ్యాణ కాంక్షతో ఈ మానవాళికి అందించాడు. మాఘశుద్ధ ఏకాదశి తిథిని భీష్మ సంస్మరణదినంగా శ్రీకృష్ణుడు కానుకగా ఇవ్వగా.. మాఘశుద్ధ అష్టమి తిథిరోజున భీష్ముని ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణునిలో లీనమైంది. మహాభారత యితిహాసంలోని ఓ మహామహుని మహాప్రస్థానం ఇలా ముగిసింది. భీష్మ నిర్యాణం జరిగి సహస్రాబ్దాలు గతిస్తున్నా ఆయన ప్రవచించిన “విష్ణుసహస్రనామస్తోత్రం” యిప్పటికీ భాగవతుల రసాగ్రాలపై నర్తిస్తూనే వుంది. ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే వుంది. విష్ణుసహస్రనామ పఠనం సర్వదుఃఖహరణం, సకల శుభకరణం. ఆ నామావళిలోని ప్రతి అక్షరము దైవస్వరూపమే. ప్రతినామమూ మహామంత్రమే. అది అజరామరం. భీష్ముడు పరమపథం చేరిన మాఘశుద్ధ అష్టమిని “భీష్మాష్టమి”గాను, మాఘశుద్ధ ఏకాదశిని “భీష్మఏకాదశి”గాను హిందువులు జరుపుకుంటారు.

Also Read:

శ్రీరామనగరంలో కనులపండుగగా శ్రీభగవద్రామానుజుల సహస్రాబ్ధి ఉత్సవాలు.. ఇవాళ మచ్చింతల్‌కు రాజ్‌నాథ్ సింగ్, రవిశంకర్

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?