AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Statue of Equality: శ్రీరామనగరంలో కనులపండుగగా శ్రీభగవద్రామానుజుల సహస్రాబ్ధి ఉత్సవాలు.. ఇవాళ మచ్చింతల్‌కు రాజ్‌నాథ్ సింగ్, రవిశంకర్

హైదరాబాద్ మహానగరం శివారు శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ శ్రీరామనగరం.. దివ్యసాకేతంలో ఆధ్యాత్మిక పరిమళం ఉట్టిపడుతోంది. జై శ్రీమన్నారాయణ..! నినాదాలు మార్మోగాయి.

Statue of Equality: శ్రీరామనగరంలో కనులపండుగగా శ్రీభగవద్రామానుజుల సహస్రాబ్ధి ఉత్సవాలు.. ఇవాళ మచ్చింతల్‌కు రాజ్‌నాథ్ సింగ్, రవిశంకర్
Ramanujacharya Sahasrabdi Celebrations By Chinna Jeeyar Swamy 8th Day Live Updates Video 10 02 2022
Balaraju Goud
|

Updated on: Feb 10, 2022 | 12:29 PM

Share

Sri Ramanuja Millennium Celebrations 9th Dayఫ హైదరాబాద్(Hyderabad) మహానగరం శివారు శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ శ్రీరామనగరం(Sriramanagaram).. దివ్యసాకేతంలో ఆధ్యాత్మిక పరిమళం ఉట్టిపడుతోంది. శ్రీత్రిదండి చిన జీయర్ స్వామి(Sri Tridandi China Jiyar Swami)  జై శ్రీమన్నారాయణ..! నినాదాలు మార్మోగాయి. యాగాలు, యజ్ఞక్రతువులు, విశేషపూజలతో అలరారుతోంది. శ్రీరామనగరంలో శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ధి ఉత్సవాలు మహావైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ తొమ్మిదో రోజు రథసప్తమి సందర్భంగా పలు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం అష్టాక్షరీ మంత్ర పఠనం, పెరుమాళ్‌స్వామికి ప్రాతఃకాళ ఆరాధనతోపాటు 9 గంటలకు శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞం పూర్తయింది. దాంతోపాటు వైయూహిక ఇష్టి, నారసింహ ఇష్టి నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మధ్నాహం 12.30 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది.

ఇవాళ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో కొలువైన 108 దివ్యతిరుపతుల్లోని 20 దేవాలయాల్లో ప్రాణప్రతిష్ఠ, కుంభాభిషేకం, మహా సంప్రోక్షణ నిర్వహిస్తారు. నక్షత్రం, రాశి ఆధారంగా దివ్యదేశాలకు ప్రాణ ప్రతిష్ట చేస్తారు. సారనాథ పెరుమాళ్, నాన్మదియ పెరుమాళ్, వయవాళి మణవాళన్, సౌందర్యరాజ పెరుమాళ్, తడాళన్, గజేంద్రవరదన్, వైకుంఠనాథ పెరుమాళ్,పేరారుళ్ళాన్, మణిక్కూడనాయకన్,సేంగన్ మాళ్, తామరైయాళ్ కేళ్వన్, సత్యగిరినాథన్,తణ్కాలప్పన్, కాట్కరైయప్పన్, తిరుమూళిక్కలత్తాన్, అద్భుతనారాయణన్, శ్రీఅనంతపద్మనాభస్వామి, నృసింహ పెరుమాళ్, నిత్యకళ్యాణ పెరుమాళ్, స్థలశయన పెరుమాళ్ దివ్య తిరుపతులకు ప్రాణప్రతిష్ట చేస్తారు.

ఇక ఇవాళ కూడా పలువురు ప్రముఖులు ముచ్చింతల్‌కు విచ్చేసి,శ్రీరామానుజచార్యుల వారి అనుగ్రహన్ని పొందనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌ స్థాపకుడు గురుదేవ్ రవి శంకర్ ముంచితల్‌ ఆశ్రమానికి రానున్నారు. యాగశాల సందర్శన తర్వాత…పెరుమాళ్‌స్వామి పూజలు రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొంటారు. రాజ్‌నాథ్‌సింగ్‌కు 5 వేల మంది రుత్వికులు ఆశీర్వచనం ఇవ్వనున్నారు. అనంతరం సమతామూర్తిని, 108 దివ్యదేశాల ఆలయాలను రాజ్‌నాథ్‌సింగ్ సందర్శిస్తారు.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..