ఇవాళ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో కొలువైన 108 దివ్యతిరుపతుల్లోని 20 దేవాలయాల్లో ప్రాణప్రతిష్ఠ, కుంభాభిషేకం, మహా సంప్రోక్షణ నిర్వహిస్తారు. నక్షత్రం, రాశి ఆధారంగా దివ్యదేశాలకు ప్రాణ ప్రతిష్ట చేస్తారు. సారనాథ పెరుమాళ్, నాన్మదియ పెరుమాళ్, వయవాళి మణవాళన్, సౌందర్యరాజ పెరుమాళ్, తడాళన్, గజేంద్రవరదన్, వైకుంఠనాథ పెరుమాళ్,పేరారుళ్ళాన్, మణిక్కూడనాయకన్,సేంగన్ మాళ్, తామరైయాళ్ కేళ్వన్, సత్యగిరినాథన్,తణ్కాలప్పన్, కాట్కరైయప్పన్, తిరుమూళిక్కలత్తాన్, అద్భుతనారాయణన్, శ్రీఅనంతపద్మనాభస్వామి, నృసింహ పెరుమాళ్, నిత్యకళ్యాణ పెరుమాళ్, స్థలశయన పెరుమాళ్ దివ్య తిరుపతులకు ప్రాణప్రతిష్ట చేస్తారు.
ఇక ఇవాళ కూడా పలువురు ప్రముఖులు ముచ్చింతల్‌కు విచ్చేసి,శ్రీరామానుజచార్యుల వారి అనుగ్రహన్ని పొందనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ స్థాపకుడు గురుదేవ్ రవి శంకర్ ముంచితల్ ఆశ్రమానికి రానున్నారు. యాగశాల సందర్శన తర్వాత…పెరుమాళ్‌స్వామి పూజలు రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొంటారు. రాజ్‌నాథ్‌సింగ్‌కు 5 వేల మంది రుత్వికులు ఆశీర్వచనం ఇవ్వనున్నారు. అనంతరం సమతామూర్తిని, 108 దివ్యదేశాల ఆలయాలను రాజ్‌నాథ్‌సింగ్ సందర్శిస్తారు.