AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD Temple: శ్రీవారి భక్తులకు డబుల్ ధమాకా!.. టీటీడీ ఈవో ఏం చెప్పారలంటే..

TTD Temple: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శభవార్త చెప్పింది. ఒకటి కాదు.. రెండు గుడ్ న్యూస్‌లు చెప్పింది. కరోనా పరస్థితులతో నిలిపివేసిన సర్వదర్శన

TTD Temple: శ్రీవారి భక్తులకు డబుల్ ధమాకా!.. టీటీడీ ఈవో ఏం చెప్పారలంటే..
Ttd
Shiva Prajapati
|

Updated on: Feb 10, 2022 | 2:48 PM

Share

TTD Temple: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శభవార్త చెప్పింది. ఒకటి కాదు.. రెండు గుడ్ న్యూస్‌లు చెప్పింది. కరోనా పరస్థితులతో నిలిపివేసిన సర్వదర్శన టోకెన్ల జారీని పునరుద్ధరించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 16వ తేదీ నుంచి తిరుపతిలో ఆఫ్ లైన్ ద్వారా సర్వ దర్శన టోకెన్ల జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో జవహార్ రెడ్డి తెలిపారు. రోజుకు 10 వేల టోకెన్లను ఆఫ్ లైన్ ద్వారా జారీ చేయనున్నట్లు చెప్పారు. ఇక ఆన్‌లైన్‌లో కూడా సర్వదర్శన టోకెన్ల జారీ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఆర్థిత సేవల పునరుద్ధరణపై కూడా బోర్డు మీటింగ్ చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఈవో జవహార్ రెడ్డి తెలిపారు.

ఇక మరో శుభవార్త ఏంటంటే.. తిరుమలలో శ్రీవారి ఉదయస్తమాన సేవా టికెట్లను అందుబాటులోకి తీసుకువస్తాయని టీటీడీ ఈవో జవహార్ ప్రకటించారు. ఈ నెల 16వ తేదీన ఉదయస్తమాన సేవా టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతామన్నారు. టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు రూ. కోటి విరాళమిచ్చిన భక్తులు ఉదయస్తమాన సేవా టికెట్లను బుక్ చేసుకోవచ్చునని తెలిపారు. టీటీడీ వెబ్‌సైట్‌లో ఉదయస్తమాన సేవా టికెట్ల బుకింగ్‌కు ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేశామని ఈవో జవహార్ రెడ్డి తెలిపారు. ఆసక్తికర భక్తులు ఆన్‌లైన్ ద్వారా విరాళమిచ్చి టికెట్లు బుక్ చేసుకోవచ్చునని చెప్పారు.

Also read:

Chiranjeevi: నెలాఖరులో గుడ్‌ న్యూస్‌ వింటాం.. జగన్‌ సానుకూలంగా స్పందించారన్న చిరంజీవి..

UPSC Civils 2022: సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్ధులకు అటెంప్ట్స్‌ విషయంలో ఎటువంటి సడలింపులు లేవు..!

Allu Arha: తండ్రికి తగ్గ తనయ.. బదామీ సాంగ్ కు అర్హ డ్యాన్స్ వీడియో వైరల్.. మేడమ్ సార్.. మేడం అంతే అంటున్న ఫ్యాన్స్..