Chiranjeevi: నెలాఖరులో గుడ్‌ న్యూస్‌ వింటాం.. జగన్‌ సానుకూలంగా స్పందించారన్న చిరంజీవి..

Chiranjeevi: నెలాఖరులో గుడ్‌ న్యూస్‌ వింటాం.. జగన్‌ సానుకూలంగా స్పందించారన్న చిరంజీవి..
Chiranjeevi, Jagan (File Photo)

Chiranjeevi: ఏపీలో సినిమా టికెట్ల వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్ని పరిస్థితులకు శుభం కార్డు వేసేందుకు టాలీవుడ్‌ ప్రముఖులు ముందడగు వేశారు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌ ప్రముఖులు గురువారం...

Narender Vaitla

| Edited By: Ravi Kiran

Feb 10, 2022 | 5:12 PM

Chiranjeevi: ఏపీలో సినిమా టికెట్ల వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్ని పరిస్థితులకు శుభం కార్డు వేసేందుకు టాలీవుడ్‌ ప్రముఖులు ముందడగు వేశారు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌ ప్రముఖులు గురువారం ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. చిరంజీవి, ప్రభాస్‌, మహేష్‌, రాజమౌళి, కొరటాల శివతో పాటు పలువురు ఈ సమావేశానికి హాజరయ్యారు.

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన చిరంజీవి.. సీఎం జగన్‌ నిర్ణయం ఎంతోషాన్ని ఇచ్చిందని చిరంజీవి అన్నారు. టికెట్‌ ధరలపై ఇక శుభం కార్డు పడినట్లు తాము భావిస్తున్నామని చెప్పారు. చిన్న సినిమాలకు కూడా ఐదో షోకు అనుమతివ్వడం మంచి పరిణామమని చిరు అన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఇంకా మాట్లాడుతూ.. ‘సమస్యల పరిష్కారానికి సంబంధించి ఈనెలాఖరులోనే జీవో వస్తుందని భావిస్తున్నాము.

మంత్రి పేర్ని నాని చొరవతో ఈ సమస్యలకు శుభంకార్డు పడింది. హైదరాబాద్‌ తరహాలో విశాఖలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు జగన్‌ అన్నారు. సీఎం నిర్ణయానికి తమవంతు సహకారం ఉంటుంది. మొత్తం మీద సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. సామరస్య పూర్వకంగా సమస్యలు పరిష్కరించుకుంటాము’ అని చిరు చెప్పుకొచ్చారు. టాలీవుడ్‌ ప్రముఖులంతా ఒక్కసారిగా రంగంలోకి దిగేసరికి ఇన్ని రోజుల వివాదానికి చెక్‌ పడినట్లు కనిపిస్తోంది.

Also Read: Janagaon news: జనగామలో మళ్లీ ఉద్రిక్తత.. బీజేపీ, టీఆర్ఎస్ నేతల బాహాబాహీ

IPL 2022 Auction: మెగా వేలానికి సిద్ధమైన బెంగళూరు.. 10 జట్లు, 590 మంది ప్లేయర్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే

Sreemukhi: కొత్త కొత్త ఫొటోస్‌తో హోరెత్తిస్తున్న బబ్లీ బ్యూటీ.. యాంకర్ ‘శ్రీముఖి’.. (ఫొటోస్)

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu