Janagaon news: జనగామలో మళ్లీ ఉద్రిక్తత.. బీజేపీ, టీఆర్ఎస్ నేతల బాహాబాహీ

బుధవారం జరిగిన టీఆర్ఎస్, జీజేపీ నేతల మధ్య ఘర్షణను నిరసిస్తూ బీజేపీ నేతలు గురువారం ఉదయం జనగామ ప్రధాన కూడళ్లలో దీక్షకు పిలుపునిచ్చారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల..

Janagaon news: జనగామలో మళ్లీ ఉద్రిక్తత.. బీజేపీ, టీఆర్ఎస్ నేతల బాహాబాహీ
Janagaon
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 10, 2022 | 1:28 PM

బుధవారం జరిగిన టీఆర్ఎస్(TRS), జీజేపీ(BJP) నేతల మధ్య ఘర్షణను నిరసిస్తూ బీజేపీ నేతలు గురువారం ఉదయం జనగామ(Janagaon) ప్రధాన కూడళ్లలో దీక్షకు పిలుపునిచ్చారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి మౌన దీక్ష చేసేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతలో టీఆర్ఎస్ అక్కడికి చేరుకుని నినాదాలు చేయడంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ వివాదంలో జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దశమంత్ రెడ్డితో పాటు పలువురికి గాయాలయ్యాయి. ఇంత వివాదం జరుగుతున్నా టీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేయకుండా బీజేపీ నేతలను మాత్రమే అదుపులోకి తీసుకుని అడ్డుకోవడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదానికి పోలీసులే ప్రధాన కారణమని పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారని, చట్టం అందరికీ సమానంగా ఉండాలని ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ విభజనపై పార్లమెంట్​లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తెరాస, కాంగ్రెస్ పార్టీలు భాజపాపై విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జనగామ చౌరస్తాలో కాంగ్రెస్, తెరాస ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని భాజపా శ్రేణులు అడ్డుకోవటంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు పార్టీల శ్రేణులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తెరాస, భాజపా శ్రేణులు పోటాపోటీ నినాదాలు చేసుకున్నాయి. సహనం కోల్పోయిన భాజపా, తెరాస కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

Also Read

Ranu Mondal: శ్రీవల్లి సాంగ్ లోని అల్లు అర్జున్ హుక్ స్టెప్ ని అనుకరించిన రాను మండల్.. వద్దు బాబోయ్ అంటున్న నెటిజన్లు..

DJ Tillu as Siddhu Jonnalagadda: యూత్ ను ఎట్రాక్ట్ చేస్తున్న రైటర్ కమ్ హీరో ‘డిజె టిల్లు’.. అలియాస్ ‘సిద్దు జొన్నలగడ్డ’..(ఫొటోస్)

IPL 2022 Auction: మెగా వేలానికి సిద్ధమైన బెంగళూరు.. 10 జట్లు, 590 మంది ప్లేయర్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే