Rajya Sabha: రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ వాకౌట్.. ప్రధానిపై ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్‌పై నిర్ణయం తీసుకోవాలిః కేకే
ప్రివిలేజ్ నోటీసుపై ఛైర్మన్ నిర్ణయం తీసుకునే వరకు సభకు వెళ్లరాదని టీఆర్ఎస్ ఎంపీలు నిర్ణయం తీసుకున్నట్లు టీఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత కే.కేశవరావు తెలిపారు.
TRS MPs Walkout From Rajya Sabha: రాజ్యసభ సాక్షిగా తెలంగాణ(Telangana) బిల్లుపై ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఇవాళ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు(Privilege Motion) ఇచ్చారు. ఇవాళ సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే.. టీఆర్ఎస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకువెళ్లి నిరసన తెలిపారు. ప్రధానిపై ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్‌పై నిర్ణయం తీసుకోవాలని ఎంపీ కేశవరావు డిప్యూటీ చైర్మెన్ హరివంశ్‌ను కోరారు. ఆ సందర్భంలో ఆయన స్పందిస్తూ.. సభా హక్కుల నోటీసు అందిందని, రాజ్యసభ చైర్మెన్ పరిశీలన కోసం ప్రివిలేజ్ నోటీసును పంపినట్లు ఆయన చెప్పారు. దానిపై చైర్మెన్ వెంకయ్యనాయుడు నిర్ణయం తీసుకుంటారని హరివంశ్ తెలిపారు.
మరోవైపు కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్షాలు కూడా టీఆర్ఎస్ వాదనతో సంఘీభావం తెలిపాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖార్గే కూడా టీఆర్ఎస్ కు మద్దతు పలికారు. ప్రివిలేజ్ నోటీసుపై ఛైర్మన్ నిర్ణయం తీసుకునే వరకు సభకు వెళ్లరాదని టీఆర్ఎస్ ఎంపీలు నిర్ణయం తీసుకున్నట్లు టీఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత కే.కేశవరావు తెలిపారు. ఈ క్రమంలోనే సభనుండి వాకౌట్ చేశామన్నారు. అటు లోక్‌సభలోనూ స్పీకర్‌కు ప్రివిలేజ్ నోటిసును అందయనున్నట్టు ఆయన తెలిపారు. సాయంత్రం స్పీకర్‌కు అందించనున్నట్టు స్పష్టం చేశారు.
We’ve moved a Privilege Motion against PM. Since Chairman isn’t here, Dy Chairman said he’ll pass it on to the Chairman for his decision….Later TRS decided to walk out of the House, pending the decision of the Chairman, until he comes and says what it is: K Keshava Rao, TRS MP pic.twitter.com/QBF1SVOcSV
— ANI (@ANI) February 10, 2022