CM KCR Alerts: ఏ క్షణానైనా ఈడీ రావొచ్చు.. జాగ్రత్త అంటున్న గులాబీ బాస్.. TRS పార్టీ నేతల్లో మొదలైన గుబులు!
ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఏ క్షణానైనా రావొచ్చు.. జాగ్రత్త అంటున్నారు గులాబీ బాస్.. అసలే భారతీయ జనతా పార్టీతో కయ్యానికి దిగాం.. ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు అంటూ టీఆర్ఎస్ పార్టిలోని రిచ్ పీపుల్‌కి ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారట.
CM KCR Alerts TRS Leaders: ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)(Enforcement Directorate) ఏ క్షణానైనా రావొచ్చు.. జాగ్రత్త అంటున్నారు గులాబీ బాస్.. అసలే భారతీయ జనతా పార్టీ(BJP)తో కయ్యానికి దిగాం.. ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు అంటూ టీఆర్ఎస్(TRS) పార్టిలోని రిచ్ పీపుల్‌కి ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారట. బీజేపేతర రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలపై ప్రయోగిస్తున్న అస్త్రాలను ఇక్కడ కూడా గురిపెట్టవచ్చంటూ పార్టీ నేతలకు సూచనలిస్తున్నారు సీఎం కేసీఅర్. అధినేత హెచ్చిరికలతో ఒక్కసారిగా పార్టీ నేతల్లో కలవరం మొదలైంది.
గత ఆరు నెలలుగా తెలంగాణ రాష్ట్ర సమితి – భారతీయ జనతా పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ ఒకరిపై మరొకరు విమర్శనా బాణాలు సంధించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే టార్గెట్ చేస్తూ సీఎం కేసీఆర్ గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఏకంగా కేంద్రంలో బీజేపీ సర్కార్‌ను గద్దె దించాలని సీఎం కేసీఅర్.. దేశప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల నేతలో బీజేపీ వ్యతిరేక కూటమి కోసం మంతనాలు కూడా జరుపుతున్నారు. జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలన్న వ్యూహంతో ముందుకు వెళుతున్నారు కేసీఅర్.
ఇదే క్రమంలో బీజేపీ సైలెంట్‌గా ఉండదని.. ఖచ్చితంగా టీఅర్ఎస్ పార్టీని, నేతలను టార్గెట్ చేస్తారని ముందుగానే అంచనా వేస్తున్నారు గులాబీ బాస్. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ నేతలు అనుసరించిన స్ట్రాటజీ, ప్రతిపక్షాలపై ఎక్కుపెట్టిన అస్త్రాలు ఇలా అన్నింటిని పసిగడుతున్నారు టీఅర్ఎస్ అధినేత కేసీఆర్. ఇందులో భాగంగానే అనేక కేంధ్ర ప్రభుత్వ సంస్థలను రంగంలోకి దించుతారని.. ఈడీ, ఇన్‌కంటాక్స్, సీబీఐ వంటి సంస్థలతో ఏ సమయంలోనైనా దర్యాప్తులు ఉంటాయని బహిరంగంగానే వ్యాఖ్యానించారు కేసిఅర్. గతంలో అనేక రాష్ట్రాల్లో ఇలాగే జరిగిందని మెన్నటికీ మెన్న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఈడీ దాడులు జరిగాయని గుర్తు చేశారు. అదే విధంగా మన రాష్ట్రంలోనూ ముఖ్యంగా టీఆర్ఎస్ నేతలపై కూడా ఈడీ దాడులు చేయవచ్చని టీఅర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు.
టీఅర్ఎస్ పార్టీలో కూడా అనేకమంది పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పదవుల్లో ఉన్నారు. వారందరికి జాగ్రత్తగా ఉండాలని సూచించారట సీఎం కేసీఅర్. వ్యాపారాలు, పరిశ్రమలు ఎంత సజావుగా నడుపుతున్నా మనకు తెలియకుండానే చిన్న చిన్న తప్పిదాలు ఉంటాయని, వాటినే ఎన్‌ఫోర్స్‌మెంట్ లాంటి సంస్థలు ఇబ్బందులకు గురిచేస్తాయని పార్టీ ముఖ్యనేతలతో కేసీఅర్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కొంత సమయం కేటాయించయినా అన్ని లెక్కలు పక్కాగా ఉండేలా చూసుకోవాలని, ఓకవేళ కేంద్ర సంస్థలు దాడులు చేసినా అందోళన చెందవద్దని సూచించారట. బందువులు, స్నేహితులకు కూడా ఇదే సమాచారన్ని షేర్ చేసుకోవాలని కూడా చెప్పారట. మనం టార్గెట్ అయినప్పుడు తెలియకుండానే వారు కూడా ఇందులో ఇరుక్కుంటారని చెప్పినట్లు సమాచారం. సీఎం హెచ్చరికలతో టీఅర్ఎస్ నేతల్లో కొత్త గుబులు మొదలైంది. వచ్చే ఉపత్తును ఎదుర్కొనేందుకు రిచ్ లీడర్స్ లెక్కలు చూసుకునే పనిలో పడ్డారట.
Read Also…. Rajya Sabha: రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ వాకౌట్.. ప్రధానిపై ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్‌పై నిర్ణయం తీసుకోవాలిః కేకే