Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Civils 2022: సివిల్ సర్వీస్‌ అభ్యర్ధులకు అలర్ట్‌.. ఆ రూల్స్‌పై కీలక నిర్ణయం.. పూర్తి వివరాలివే!

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల (Civil Services Examination )కు హాజరయ్యే అభ్యర్ధుల వయోపరిమితి, నిర్ణీత అటెంప్ట్స్‌కు సంబంధించి ఎలాంటి సడలింపులు ఇచ్చే ప్రతిపాదన లేదని పీఎంవో శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌..

UPSC Civils 2022: సివిల్ సర్వీస్‌ అభ్యర్ధులకు అలర్ట్‌.. ఆ రూల్స్‌పై కీలక నిర్ణయం.. పూర్తి వివరాలివే!
Upsc Civils 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 10, 2022 | 4:01 PM

UPSC CSE aspirants seeking for additional attempts due to Covid 19: సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల (Civil Services Examination )కు హాజరయ్యే అభ్యర్ధుల వయోపరిమితి, నిర్ణీత అటెంప్ట్స్‌కు సంబంధించి ఎలాంటి సడలింపులు ఇచ్చే ప్రతిపాదన లేదని పీఎంవో శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ (PMO Minister Jitendra Singh) గురువారం (ఫిబ్రవరి 10) రాజ్యసభలో ప్రకటించారు. కోవిడ్‌ మహమ్మారి నేపధ్యంలో 2020లో యూపీఎస్సీ (UPSC) నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు అదనపు అటెంప్స్ట్‌కు అవకాశం కల్పించవలసిందిగా సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని కోరిందని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. కోవిడ్‌ కారణంగా సివిల్స్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు వయోపరిమితి, నిర్ణీత అటెంప్ట్స్‌ విషయంలో సడలింపు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కొందరు సివిల్స్‌ ఆశావహ అభ్యర్ధులు సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్లు దాఖలు చేసినట్లు మంత్రి తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పులను పరిశీలించిన అనంతరం అభ్యర్ధుల వయోపరిమితి సడలింపు, అదనపు అటెంప్ట్స్‌కు అవకాశం కల్పించేలా నిబంధనల్లో మార్పు తీసుకురావడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. పైన తెలిపిన కారణాల నేపధ్యంలో సివిల్స్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు సడలింపులు ఇచ్చే ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని మంత్రి స్పష్టం చేశారు.

కాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీస్ పరీక్ష (CSE) 2022 సంవత్సరానికి గాను నోటిఫికేషన్‌ను ఈ నెల 3న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా యూపీఎస్సీ వివిధ సివిల్ సర్వీసుల (IAS, IPS)కు చెందిన మొత్తం 861 ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు నేటి (శుక్రవారం, ఫిబ్రవరి 4, 2022) నుంచి ఫిబ్రవరి 22 (సాయంత్రం 6 గంటల వరకు) ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. అభ్యర్ధులు upsc.gov.in లేదా upsconline.nic.in. వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ప్రిలిమ్స్‌ పరీక్ష విధానం ఇలా.. యూపీఎస్సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌ 2 గంటలపాటు 200 మార్కులకు ఉంటుంది. ఉదయం, మద్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలుంటాయి. రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. మొదటి పేపర్‌ సైన్స్ అండ్ టెక్నాలజీ, చరిత్ర, సంస్కృతి, భౌగోళికం, భారత రాజకీయాలు, భారత ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం – జీవావరణ శాస్త్రం, కరెంట్ అఫైర్స్ మీద ప్రశ్నలు ఉంటాయి. ఐతే వీటిలో రెండో పేపర్ జనరల్ స్టడీస్ క్వాలిఫైయింగ్ పేపర్‌గా ఉంటుంది. దీనిలో 33 శాతం అర్హత సాధించాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులను మెయిన్స్ రాయడానికి అనుమతిస్తారు. మెయిన్స్ పరీక్షలు మొత్తం 1750 మార్కులకు ఉంటుంది. చివరిగా ఇంటర్వ్యూ 275 మార్కులకు ఉంటుంది. మొత్తం 2025 మార్కులకు యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తుంది.

Also Read: