Attention: యూపీఎస్సీ 2022 సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష నోటిఫికేషన్ విడుదల.. ఈ సారి ఎన్ని పోస్టులున్నాయంటే..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీస్ పరీక్ష (CSE) 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ సివిల్ సర్వీసుల (IAS, IPS)కు చెందిన..

Attention: యూపీఎస్సీ 2022 సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష నోటిఫికేషన్ విడుదల.. ఈ సారి ఎన్ని పోస్టులున్నాయంటే..
UPSC Civil Services 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 04, 2022 | 12:04 PM

UPSC Civil Services exam 2022 Notification: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీస్ పరీక్ష (CSE) 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ సివిల్ సర్వీసుల (IAS, IPS)కు చెందిన ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, పరీక్ష విధానం, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ – 2022

మొత్తం ఖాళీలు: 861

అర్హతలు: అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా అర్హులే.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు ఆగస్టు 1, 2022 నాటికి 21 ఏళు ఉండాలి. అలాగే 32 ఏళ్లు మించకుండా ఉండాలి. అంటే ఆగస్టు 2, 1990 నుంచి ఆగస్టు 1, 2001 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీకి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అటెంప్టుల సంఖ్య: ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు అపరిమితం. ఓబీసీ, ఇతర (GL/EWS) అభ్యర్ధులు 9 ప్రయత్నాలలో సర్వీస్ చేపట్టవచ్చు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్ అనే రెండు స్టేజిలలో జరుగుతుంది.

ప్రిలిమినరీ పరీక్ష విధానం:

  • ఈ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 2 గంటల్లో 200 మార్కులకు ఉంటుంది. ఉదయం, మద్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలుంటాయి. రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి.
  • మొదటి పేపర్‌ సైన్స్ అండ్ టెక్నాలజీ, చరిత్ర, సంస్కృతి, భౌగోళికం, భారత రాజకీయాలు, భారత ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం – జీవావరణ శాస్త్రం, కరెంట్ అఫైర్స్ మీద ప్రశ్నలు ఉంటాయి
  • ఐతే వీటిలో రెండో పేపర్ జనరల్ స్టడీస్ క్వాలిఫైయింగ్ పేపర్‌గా ఉంటుంది. దీనిలో 33 శాతం అర్హత సాధించాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులను మెయిన్స్ రాయడానికి అనుమతిస్తారు.
  • మెయిన్స్ పరీక్షలు మొత్తం 1750 మార్కులకు ఉంటుంది.
  • చివరిగా ఇంటర్వ్యూ 275 మార్కులకు ఉంటుంది.
  • మొత్తం 2025 మార్కులకు యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తుంది.

ఇంకా పరీక్షకు సంబంధించిన సిలబస్ వంటి ఇతర ముఖ్య సమాచారం కోసం యూపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: జూన్ 5, 2022.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: ఓబీసీ/ఇతర అభ్యర్ధులకు రూ 100 ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 22, 2022 (సాయంత్రం 6 గంటల వరకు).

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

BEL Jobs: బీటెక్‌/ఎంటెక్‌ యువతకు అలర్ట్‌! నెలకు రూ.40,000ల జీతంతో 75 ట్రైనీ ఇంజనీర్‌ ఉద్యోగాలు.. వివరాలివే

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి