Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు. మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయని మంత్రులు తెలిపారు.

Andhra Pradesh: ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
Ap Ssc Exams
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 10, 2022 | 2:25 PM

ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు. మే 2 నుంచి మే 13 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పదో తరగతి ఎగ్జామ్స్ జరుగుతాయి. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతాయి.  విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఎగ్జామ్స్ పెట్టడం అవసరమని విద్యాశాఖ మంత్రి సురేష్ ఇప్పటికే స్పష్టం చేశారు. మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయని మంత్రులు తెలిపారు.  కరోనా కొత్త నిబంధనల ప్రకారం స్కూళ్లు, కాలేజీలు నడిపిస్తున్నామని ఆయన తెలిపారు. ఎగ్జామ్స్ కూడా కరోనా నిబంధలను పాటిస్తూ నిర్వహిస్తామని వెల్లడించారు.

మొత్తంగా  మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్షలు జరుగనున్నాయి. 1456 సెంటర్లలో ఈ పరిక్షలు నిర్వహిస్తున్నారు. మొదటి సంవత్సరం 5,05,052 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం 4,81,481 విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారు. మొత్తం 9,86,533 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. 2022 సంవత్సరం మే 2 నుంచి మే13 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 6,39,805 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయనున్నారు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ దిగువన చూడండి 

10th Class Exams Schedule

10th Class Exams Schedule

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ దిగువన చూడండి 

Inter Exams Schedule

Inter Exams Schedule

Also Read: CM Jagan: ఏపీ సీఎం జగన్‌ సీరియస్‌.. అతి చేసినవారికి అక్షింతలు.. పునరావృతం కావొద్దని ఆదేశం

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌లో అవకాడో తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌లో అవకాడో తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే
చాన్నాళ్ళకు ఫ్యాన్స్ ముందుకు తారక్.. ఏమి మాట్లాడారంటే.?
చాన్నాళ్ళకు ఫ్యాన్స్ ముందుకు తారక్.. ఏమి మాట్లాడారంటే.?
స్టాక్ మార్కెట్లో గందరగోళం.. 5 నిమిషాల్లోనే 19 లక్షల కోట్లు అవిరి
స్టాక్ మార్కెట్లో గందరగోళం.. 5 నిమిషాల్లోనే 19 లక్షల కోట్లు అవిరి
నా కొడుకు ఏ తప్పు చేయలేదు.. ఐటీ దర్యాప్తుపై పృథ్వీరాజ్ తల్లి కామె
నా కొడుకు ఏ తప్పు చేయలేదు.. ఐటీ దర్యాప్తుపై పృథ్వీరాజ్ తల్లి కామె
వైట్‌ రైస్‌కి బదులుగా ఓట్స్‌ తింటున్నారా..? ఏమౌతుందో తెలుసుకోవడం
వైట్‌ రైస్‌కి బదులుగా ఓట్స్‌ తింటున్నారా..? ఏమౌతుందో తెలుసుకోవడం
అమెరికాలో లక్షల్లో జీతం.. పవన్ కళ్యా్ణ్ సినిమాలో ఛాన్స్ రావడంతో..
అమెరికాలో లక్షల్లో జీతం.. పవన్ కళ్యా్ణ్ సినిమాలో ఛాన్స్ రావడంతో..
తక్కువ పెట్టుబడి..ఇంటి నుండే పొటాటో చిప్స్ తయారీ.. రెట్టింపు లాభం
తక్కువ పెట్టుబడి..ఇంటి నుండే పొటాటో చిప్స్ తయారీ.. రెట్టింపు లాభం
ఇద్దరు బాలలను చెట్టుకు కట్టేసి.. ఎర్ర చీమలతో..
ఇద్దరు బాలలను చెట్టుకు కట్టేసి.. ఎర్ర చీమలతో..
ఆధార్-ఓటరు గుర్తింపు కార్డును ఎలా లింక్ చేయాలి?
ఆధార్-ఓటరు గుర్తింపు కార్డును ఎలా లింక్ చేయాలి?
బ్లాక్‌ మండే.. ట్రంప్ ఎఫెక్ట్‌తో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..
బ్లాక్‌ మండే.. ట్రంప్ ఎఫెక్ట్‌తో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..