యువతికి దగ్గరై.. మరో యువతితో పెళ్లికి సిద్ధమై.. అసలేం జరిగిందంటే..??

యువతికి దగ్గరై.. మరో యువతితో పెళ్లికి సిద్ధమై.. అసలేం జరిగిందంటే..??
Uravakonda

  ''నువ్వే ప్రాణమన్నాడు. నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పాడు. మంచి వాడని నమ్మి దగ్గరయ్యాను. తీరా అవసరాలు తీరాక ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకోవాలని కోరితే పొమ్మన్నాడు...

Ganesh Mudavath

|

Feb 10, 2022 | 12:42 PM

”నువ్వే ప్రాణమన్నాడు. నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పాడు. మంచి వాడని నమ్మి దగ్గరయ్యాను. తీరా అవసరాలు తీరాక ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకోవాలని కోరితే పొమ్మన్నాడు. అంతే కాకుండా మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. అతనిపై ఎలాగైనా చర్యలు తీసుకోండి సారూ..” ఇదీ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా ఉరవకొండ(Uravakonda)లో ఓ యువతి ఆవేదన. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యా్ప్తు చేపట్టారు. మరో వైపు పెళ్లి పీటలు ఎక్కి మరో అమ్మాయితో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు ఆ ప్రబుద్ధుడు. అప్రమత్తమైన పోలీసులు యువతి తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపారు. యువతి తల్లిదండ్రులు పెళ్లి రద్దు చేసుకున్నారు. దీంతో పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు కటకటాల పాలయ్యాడు.

అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన ఓ యువతి, స్థానికంగా రెడీమేడ్‌ దుస్తుల దుకాణం నిర్వహిస్తున్న షర్పీద్దున్‌ ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి దగ్గరయ్యాడు. తన అవసరాలు తీరాక ముఖం చాటేశాడు. ఈ క్రమంలో గుత్తికి చెందిన యువతితో షర్పీద్దున్‌కు వివాహం నిశ్చయమైంది. ఈ నెల 9న పెళ్లి ముహూర్తాన్ని కుదిర్చారు. విషయం తెలుసుకున్న బాధిత యువతి.. తాను మోసపోయినట్లు గుర్తించింది. ఈ నెల 8న యువకుడిపై ఉరవకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. గుత్తిలోని వధువు తరఫు పెద్దలకు సమాచారం అందించారు. దీంతో బుధవారం జరగాల్సి కల్యాణ తంతు ఆగిపోయింది. పోలీసులు షర్పీద్దున్‌పై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.

Also Read

Fake currency: యూట్యూబ్ వీడియోలు చూసి.. నకిలీ నోట్ల తయారీ.. ఆ తర్వాత ఏమైందంటే..?

Krishna District: కృష్ణా జిల్లాలో జరిగిన బాలిక హత్యకేసులో సంచలన విషయం.. బాబాయే

IPL 2022: ధోని అతడి కోసం 9.25 కోట్లు వెచ్చించాడు.. కానీ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు..?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu