Crocodile: ఆరేళ్ల తరువాత మొసలికి విముక్తి.. మెడలోని టైరును తొలగించిన సాహసికుడు.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు

ఆరేళ్లుగా మెడకు మోటార్ సైకిల్ టైర్ చిక్కుకుని ఇబ్బంది పడుతున్న మొసలికి ఎట్టకేలకు ఉపశమనం లభించింది. ఇండోనేషియా(Indonesia)లోని సులవేసి ద్వీపానికి చెందిన టిలీ అనే వ్యక్తి..

Crocodile: ఆరేళ్ల తరువాత మొసలికి విముక్తి.. మెడలోని టైరును తొలగించిన సాహసికుడు.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు
Crocodile 1
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 09, 2022 | 12:45 PM

ఆరేళ్లుగా మెడకు మోటార్ సైకిల్ టైర్ చిక్కుకుని ఇబ్బంది పడుతున్న మొసలికి ఎట్టకేలకు ఉపశమనం లభించింది. ఇండోనేషియా(Indonesia)లోని సులవేసి ద్వీపానికి చెందిన టిలీ అనే వ్యక్తి.. మొసలి మెడకు చిక్కుకున్న టైరును తొలగించాడు. మొసలి(Crocodile)ని పట్టుకునేందుకు టిలీ చాలా కష్టపడ్డాడు. దానిని ట్రాక్ చేయడం, కోళ్లు, బాతులతో ఎర వేశాడు. అయినా అతనికి మొసలి చిక్కలేదు. ఇలా ఎన్నోసార్లు ప్రయత్నాలు చేయగా.. చివరి ప్రయత్నంలో మొసలిని బంధించాడు. దాని మెడకున్న టైరును తీశాడు. అనంతరం మొసలిని తిరిగి నదిలోకి విడిచిపెట్టారు. ప్రభుత్వం నుంచి డబ్బు లభిస్తుందన్న ఆశతో తాను ఈ పని చేయలేదని, మొసలి అవస్థను చూడలేకే ఈ సాహసానికి పాల్పడ్డానని టిలీ చెప్పడం విశేషం.

” నేను మొసలిని పట్టుకున్నాను. ఇతరులను సహాయం అడిగినప్పటికీ.. మొసలిని చూసి వారు తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు. అందుకే నేనొక్కడినే మొసలిని పట్టుకోవాలని నిశ్చయించుకున్నా. దీని కోసం కోళ్లు, బాతులను ఎరగా వేశా. అయినప్పటికీ మొసలి ట్రాప్ నుంచి తప్పించుకుంది. ఎట్టకేలకు దానిని బంధించాను. చివరకు స్నేహితుల సహాయంతో టైర్‌ను తొలగించి, తిరిగి నదిలోకి విడిచి పెట్టాం.” – టిలీ, మొసలిని పట్టుకున్న వ్యక్తి.

ప్రభుత్వం బంపర్ ఆఫర్…

ఓ మొసలి మెడలో ఇరుక్కున్న టైర్‌ను తీసిన సాహసవంతులకు భారీ మొత్తంలో నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ఇండోనేషియా ప్రభుత్వం ప్రకటించింది. ఇండోనేషియా సెంట్రల్‌ సులవేసిలోని ఉప్పునీటి సరస్సులో నివసిస్తున్న మొసలి మెడకు మోటార్‌ సైకిల్‌ టైర్‌ ఇరుక్కుంది. రోజు రోజుకు ఆ టైరు మొసలి మెడ నుంచి పొట్టమీదకు జారుతూ బిగుసుకుపోతోంది. కాగా టైరు వల్ల ఇబ్బంది పడుతున్న మొసలి ప్రాణాలకు ప్రమాదం ఉందని గ్రహించిన అధికారులు దానిని తీయడానికి ఈ భారీ ఆఫర్‌ను ప్రకటించారు. అయితే ఆ ఆఫర్‌కు ఆకర్షితులైన కొంత మంది ఈ సాహసానికి పూనుకుని ముందుకు వచ్చారు. ఆ టైర్‌ను తీసేందుకు సరస్సులోకి దిగిన వారు మొసలిని ఎదుర్కొలేక వెనుతిరుగుతున్నారు.

Also Read

Trees Exploding: అక్కడ అర్ధరాత్రి చెట్లు పేలిపోతున్నాయి.. కారణం తెలిస్తే షాక్‌ అవుతారు..?

TRS MP on Modi: విభజన గాయంపై మోడీ కారం.. ప్రధాని వాఖ్యలపై భగ్గుమన్న టీఆర్ఎస్

Thalapathy Vijay: మరోసారి క్రేజీ కాంబినేషన్ రిపీట్.. ఈసారి ఇలా రాబోతున్నారట..