Chennai BJP Office Attack: చెన్నై బీజేపీ కార్యాలయంపై దాడి.. పెట్రోల్ బాంబులు విసిరిన దుండగులు..
చెన్నై(Chennai)లోని బీజేపీ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి(Attack) జరిగింది. గురువారం తెల్లవారు జామున ద్విచక్ర వాహనాల్లో వచ్చిన దుండగులు పార్టీ ఆఫీస్ పై పెట్రోల్...
చెన్నై(Chennai)లోని బీజేపీ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి(Attack) జరిగింది. గురువారం తెల్లవారు జామున ద్విచక్ర వాహనాల్లో వచ్చిన దుండగులు పార్టీ ఆఫీస్ పై పెట్రోల్ బాంబులు విసిరారు. అనంతరం పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయారు. గురువారం తెల్లవారుజామున ఒకటిన్నర గంటలకు ఈ దాడి జరిగిందని ఆ పార్టీ నాయకుడు కరాటే త్యాగరాజన్ తెలిపారు. 15 సంవత్సరాల క్రితం కూడా డీఎంకే(DMK) ప్రమేయంతో ఇలాంటి ఘటన జరిగిందని చెప్పారు. తమిళనాడు ప్రభుత్వ పాలనను ఖండిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చామని, ఇలాంటి ఘటనలకు పార్టీ నేతలు భయపడవద్దని పిలుపునిచ్చారు. సీసీ కెమెరాల ఆధారంగా చెన్నైలోని నందనం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని వినోద్‌గా గుర్తించి, ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే తమ పార్టీ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి జరగడంతో ఆ పార్టీ నేతలు ఆందోళన చేశారు.
“ గురువారం తెల్లవారుజామున సుమారు 1:30 గంటల సమయంలో పార్టీ కార్యాలయంపై పెట్రోల్ బాంబు విసిరారు. గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి ఈ దాడి చేశారు. ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించాం. బీజేపీ కార్యాలయంపై దాడి జరగడాన్ని ఖండిస్తున్నాం. ఇలాంటి సమయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయం పాటించాలని కోరుతున్నా.” – కరాటే త్యాగరాజన్, భాజపా నేత
Also Read
CM Jagan-Tollywood: ఎయిర్‌పోర్ట్‌లో ట్విస్ట్ ఇచ్చిన మెగాస్టార్.. సీఎంతో మీటింగ్‌కు తారక్ దూరం
Pawan Kalyan: వరుస సినిమాలతో పవన్ జోరు.. మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవర్ స్టార్..