AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake currency: యూట్యూబ్ వీడియోలు చూసి.. నకిలీ నోట్ల తయారీ.. ఆ తర్వాత ఏమైందంటే..?

నేరాలు చేసేందుకు అక్రమార్కులు వెరైటీ పద్ధతులను ఎంచుకుంటున్నారు. రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను ఆధారంగా చేసుకుని కొత్త పంథాకు తెర లేపుతున్నారు...

Fake currency: యూట్యూబ్ వీడియోలు చూసి.. నకిలీ నోట్ల తయారీ.. ఆ తర్వాత ఏమైందంటే..?
Fake Currency
Ganesh Mudavath
|

Updated on: Feb 10, 2022 | 10:10 AM

Share

నేరాలు(Crime) చేసేందుకు అక్రమార్కులు వెరైటీ పద్ధతులను ఎంచుకుంటున్నారు. రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను ఆధారంగా చేసుకుని కొత్త పంథాకు తెర లేపుతున్నారు. తాజాగా నకిలీ నోట్ల(Fake currency)తో మోసాలకు పాల్పడుతున్న ముఠాను వరంగల్‌ కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌, వర్ధన్నపేట సబ్‌ డివిజన్‌ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలింపు చేపట్టారు. నిందితుల నుంచి రూ.26.80 లక్షల విలువైన నకిలీ కరెన్సీ, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులు యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ మార్కెట్‌లో లభించే రాగి వస్తువులకు రసాయనాలు పూసి, వాటిని పురాతన వస్తువులను ఏమార్చి విక్రయిస్తుండేవారు.

ఇది లాభసాటిగా లేకపోవడంతో నకిలీ నోట్ల మార్పిడి చేపట్టాలని నిర్ణయించారు. పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు రూ.2వేల నకిలీ నోట్లకు నలుపు రంగు పూస్తారు. రసాయనాలతో కడిగితే నలుపు రంగు పోయి అసలైన డబ్బులుగా కనిపిస్తాయి. ఈ క్రతువును వీడియో తీసి, మార్పిడి చేసే వ్యక్తులకు వివరిస్తారు. రూ.50 వేలకు నకిలీ నల్లని రంగు పూసిన రూ.1.50 లక్షలు ఇచ్చేవారు. అలా బుధవారం ధనుంజయ్‌, హరిప్రసాద్‌రెడ్డి, మహేశ్‌ వర్ధన్నపేట పట్టణంలోని అంబేడ్కర్‌ సెంటర్ వద్ద నాగరాజుకు నకిలీ నోట్లు అందిస్తుండగా టాస్క్‌ఫోర్స్‌, వర్ధన్నపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకున్న సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

Also Read

Suicide attempt: ”మా దుస్థితికి ప్రధాని మోడీయే కారణం”.. ఫేస్ బుక్ లైవ్ లో విషం తాగిన దంపతులు

Bride Kidnap: పెళ్లైనా యువతిలో రాని మార్పు.. వద్దని ప్రియుడు వారించినా ..

రన్నింగ్ ట్రైన్ వెంట పరుగులు !! కాలు జారడంతో !! వీడియో