Bride Kidnap: పెళ్లైనా యువతిలో రాని మార్పు.. వద్దని ప్రియుడు వారించినా ..

ఆ యువతి వేరొక యువకుడిని ప్రేమించింది. అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. వీరి విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. వారు ఒప్పుకోకపోవడంతో...

Bride Kidnap: పెళ్లైనా యువతిలో రాని మార్పు.. వద్దని ప్రియుడు వారించినా ..
Kidnap
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 10, 2022 | 8:26 AM

ఆ యువతి వేరొక యువకుడిని ప్రేమించింది. అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. వీరి విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. వారు ఒప్పుకోకపోవడంతో అతనితో కలిసి పారిపోవాలని పథకం రచించింది. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఆమెకు మరొకరితో వివాహం చేశారు. అయినా ఆమెలో మార్పు రాలేదు. పెళ్లి తంతు ముగించుకుని ఇంటికి వస్తుండగా.. మార్గ మధ్యలో టాయిలెట్ కు వెళ్లొస్తానని చెప్పింది. అప్పటికే అక్కడ ఉన్న తన ప్రియుడితో కలిసి పారిపోవాలని సిద్ధమైంది. ఇది తప్పని వారించిన ప్రియుడితో ఘర్షణకు దిగింది. చివరికి యువకుడిని బలవంతంగా తీసుకెళ్లింది. సినిమా స్టోరీని తలపించేలా ఉన్న ఈ ఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని మాన్ పూర్ వద్ద జరిగింది.

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్(Raypur) లో నివాసుముండే ఆర్తి సహారే అనే యువతికి మహారాష్ట్రలోని సావర్ గావ్‌కు చెందిన యువకుడితో ఫిబ్రవరి 6న రాయ్‌పూర్ లో వివాహం జరిగింది. పెళ్లి కార్యక్రమాలు ముగించుకుని ఫిబ్రవరి 7న మహారాష్ట్రకు బయల్దేరారు. మార్గ మధ్యలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆగారు. టాయ్‌లెట్ లోపలికి వెళ్లిన నవ వధువు ఆర్తి ఎంతకూ బయటికి రాలేదు. ఆమె కోసం గంటల తరబడి వేచి ఉన్న వరుడు, మిగతా వారు ఆందోళన చెంది.. టాయ్‌లెట్ తలుపులు విరిగ్గొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ కిటికీ పగిలి ఉంది. చుట్టు పక్కలా వెతకినా.. పెళ్లికూతురు కనపించలేదు. దీంతో పెళ్లి కూతురు కిడ్నాప్ అయ్యిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. మాన్ పూర్ చెక్‌పోస్ట్ సమీపంలో పెళ్లి కూతరు ఆర్తి, ఒక యువకుడు వికాస్ గుప్తాను పోలీసులు పట్టుకున్నారు. వికాస్ గుప్తానే ఆర్తిని కిడ్నాప్ చేశాడని పోలీసులు భావించారు. అతని గురించి ఆరా తీశారు. వికాస్, ఆర్తిలు రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ వీరి పెళ్లికి ఆర్తి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో పథకం ప్రకారం ఆర్తి.. పెళ్లి రోజే ఇంటి నుంచి పారిపోదామనుకుంది. కానీ అది సాధ్యం కాలేదు. పెళ్లి అయిపోయాక ఇద్దరం కలిసి పారిపోదామని ఆర్తి వికాస్‌కు తెలిపింది. తను వరుడితో కలిసి కారులో బయలుదేరినప్పుడు వికాస్‌కు లైవ్ లొకేషన్ పంపింది. తనకోసం ఒకచోట వేచి ఉండాలంటూ మెసేజ్ చేసింది.

ఆర్తి చెప్పినట్లు వికాస్ గుప్తా టాయ్‌లెట్ వెనుక ఆమె కోసం సిద్ధంగా ఉన్నాడు. ఆర్తి టాయ్‌లెట్‌కు వెళ్లాలనే నెపంతో అక్కడికి చేరుకొని కిటికీ పగలకొట్టి వికాస్‌ను కలిసింది. కానీ ఇలా పారిపోవడం సరికాదంటూ వికాస్ ఆర్తికి వివరించాడు. దీంతో ఆర్తి బలవంతంగా వికాస్ ను తనతో తీసుకెళ్లింది. ఆ తరువాత ఇద్దరూ మాన్‌పూర్ పట్టణానికి వెళుతుండగా.. వారిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.

Also Read

Brother, Sister death: మృత్యువు విడదీయని బంధం.. అక్క వెంటే తమ్ముడు

Helping Hands: పాపం పసివాడు.. దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు.. దాతల కోసం ఎదురుచూపులు..

AP CM YS Jagan: శ్రీశారదా పీఠం వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏపీ సీఎం.. రాజశ్యామల యాగంలో పాల్గొన్న వైఎస్ జగన్