Helping Hands: పాపం పసివాడు.. దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు.. దాతల కోసం ఎదురుచూపులు..

Helping Hands: పాపం పసివాడు.. పుట్టుకతోనే కిడ్ని వ్యాధి ఆ బుడ్డోడికి శాపంలా మారింది. సరదాగా ఆడలేడు.. అందరిలా అల్లరి చేయలేడు..

Helping Hands: పాపం పసివాడు.. దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు.. దాతల కోసం ఎదురుచూపులు..
Boy
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Feb 09, 2022 | 10:39 PM

Helping Hands: పాపం పసివాడు.. పుట్టుకతోనే కిడ్ని వ్యాధి ఆ బుడ్డోడికి శాపంలా మారింది. సరదాగా ఆడలేడు.. అందరిలా అల్లరి చేయలేడు.. లోకం పోకడ తెలియని వయస్సులో తీవ్రమైన వ్యాధి వెంటాడుతున్నా.. నోరు తెరిచి నొప్పి విషయం చెప్పలేని దుస్ధితి. ఖరీదైన వైద్యం చేయించలేక.. తమ కంటి రెప్ప పడుతున్న బాధ చాడలేక నరకయాతన పడుతున్నారు ఆ దంపతులు. 18 నెలల బాలున్ని వెంటాడుతున్న ఆ సమస్య ఏంటి.. వైద్యానికి ఉన్న అడ్డంకులేంటి.. నిజామాబాద్ జిల్లాలో తీవ్రమైన వ్యాధితో నరకయాతన పడుతున్న బుడ్డోడి కష్టాలపై ప్రత్యేకమైన కథనం..

మా బిడ్డను బ్రతికించండి: దుబ్బాక అశోక్, బాలుని తండ్రి చిన్నోడి పేరు ఆర్యవర్ధన్. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన దుబ్బాక అశోక్ – స్వప్న దంపతుల ఏకైక కుమారుడు. పెళ్లైన మూడేళ్ల తరువాత.. ఆర్యవర్ధన్ మొదటి సంతానంగా జన్మంచాడు. పుట్టుకతోనే మలద్వారం లేక, ఒక కాలు పెద్దదిగా మరో కాలు చిన్నదిగా లోపంతో పుట్టాడు. నిరుపేద కుటుంబం, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో.. అశోక్ దంపతులు ఆర్యర్ధన్ కు ఖరీదైన వైద్యం చేయించారు. మల ద్వార ఆపరేషన్ చేయించారు. ఐతే కిడ్నీ సంబంధిత వ్యాధి నయం చేసేందుకు మరో 7లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో వైద్యం చేయించే స్థోమత లేక.. బాలుడు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. 18 నెలల వయస్సులో కిడ్నీ వ్యాధితో సతమతం అవుతున్న చిన్నోడిని చూసి ఆవేదన చెందుతున్నారు. తమ బాబును రక్షించాలని, వైద్యానికి ఆపన్న హస్తం అందించాలని వేడుకుంటున్నారు.

బాబును బ్రతికించండి: గ్రామ‌స్తులు బాబు పుట్టాడని సంతోష పడ్డ అశోక్ – స్వప్న దంపతులకు ఆ సంతోషం క్షణాల్లో ఆవిరైంది. పుట్టుకతో లోపం ఉందని వైద్యులు చెప్పడంతో ఆందోళన చెందారు. ఆటో డ్రైవర్ గా పనిచేసే అశోక్.. బాబుకు 3లక్షలు వెచ్చించి మలద్వార కోసం ఆపరేషన్ చేయించారు. ఐతే ఒక్క కాలు పెద్దదిగా మరో కాలు చిన్నదిగా ఉండటం, దీంతో పాటు కిడ్నీ సంబంధమైన వ్యాధితో బాబు నరకయాతన అనుభవిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. వైద్యం చేయించే స్థోమత లేక.. కన్నీటి పర్యంతం అవుతున్నారు అశోక్ దంపతులు. కిడ్నీ సంబంధిత శస్త్ర చికిత్సలకు మరో రూ.7 లక్షల వరకు అవసరమవుతాయని వైద్యులు చెబుతుండటంతో.. ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు. ఖరీదైన వైద్యం తమకు మోయలేని భారంగా మారిందని వాపోతున్నారు. దాతలు ముందుకు వస్తే చిన్నారికి వైద్యం చేయిస్తామని అంటున్నారు.

ఇంట్లో చిన్నారులు సరదాగా ఆడుతూ.. అల్లరి చేస్తుంటే తల్లిదండ్రులకు అంతకు మించిన ఆనందం ఉండదు. అదే వారు ఏదైనా అనారోగ్యానికి గురైతే పడరాని పాట్లు పడతారు. తీవ్రమైన జబ్బు వెంటాడుతుంటే వారి కష్టాలు వర్ణనాతీతం. అలాంటి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 18 నెలల బాలునికి ప్రభుత్వంబాసటగా ఎడపల్లి ప్రజలు కోరుతున్నారు. దాతలు ముందు కొచ్చి తమ దాతృత్వం చాటుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

-ప్రభాక‌ర్, టీవీ9 తెలుగు, నిజామాబాద్

Boy 1

Also read:

Big News Big Debate: పార్లమెంట్‌ సాక్షిగా తెరపైకి మానిన గాయం.. ప్రధాని వ్యాఖ్యలపై TRS అభ్యంతరం ఏంటి?

Viral: జన్‌ధన్ ఖాతాలో రూ.15 లక్షలు.. ఉబ్బితబ్బిబై రూ.9 లక్షలతో ఇల్లు కట్టేశాడు.. చివర్లో దిమ్మతిరిగే షాక్!

APVVP Jobs: ఇంటర్‌ అర్హతతో ఏపీ వైద్య విధాన పరిషత్‌లో ఉద్యోగాలు.. 3 రోజుల్లో ముగుస్తున్న గడువు!