AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada crime: కీచక గురువు.. స్నేహితుడని నమ్మి.. బాధలు చెప్పుకున్న టీచర్ పై..

విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే దుర్మార్గంగా వ్యవహరించాడు. విద్యాబుద్ధులు నేర్పించి, విద్యార్థులను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన గురువే దారి...

Vijayawada crime: కీచక గురువు.. స్నేహితుడని నమ్మి.. బాధలు చెప్పుకున్న టీచర్ పై..
Teacher Harasment
Ganesh Mudavath
|

Updated on: Feb 10, 2022 | 8:55 AM

Share

విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే దుర్మార్గంగా వ్యవహరించాడు. విద్యాబుద్ధులు నేర్పించి, విద్యార్థులను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన గురువే దారి తప్పాడు. తనను నమ్మి, వ్యక్తిగత వివరాలు పంచుకున్న ఓ ఉపాధ్యాయురాలితో అమానుషంగా ప్రవర్తించాడు. మాయమాటలతో ఆమెను లొంగదీసుకుని శారీరకంగా కలిశాడు. అనంతరం మహిళ అసభ్య ఫొటోలను చిత్రీకరించాడు. వాటిని చూపించి, బెదిరిస్తూ పలు మార్లు లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. అతని వేధింపులు తాళలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీచక ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు.

విశాఖపట్నం జిల్లా రావికమతం ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో సూరెడ్డి మహేశ్వరరావు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణా తరగతులకు హాజరయ్యాడు. ఆ సమయంలో జంగారెడ్డిగూడెం నుంచి వచ్చిన ఓ ఉపాధ్యాయురాలితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో వారిద్దరి మధ్య సాన్నిహత్యం పెరిగింది. దీంతో మహేశ్వరరావును నమ్మిన ఉపాధ్యాయురాలు.. తనకు 2019 లో వివాహమైందని, భర్త శారీరకంగా వేధిస్తున్నాడని చెప్పారు. గతేడాది సెప్టెంబరు 27న వీరిద్దరూ విజయవాడ బస్టాండ్‌ సమీపంలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. ఇద్దరూ శారీరకంగా కలుసుకున్నారు. ఉపాధ్యాయురాలు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆమె అశ్లీల ఫొటోలు తీశాడు. తర్వాత ఆ ఫొటోల చూపించి మహిళను బెదిరించడం ప్రారంభించాడు. మహేశ్వరరావు వేధింపులు తట్టుకోలేని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఉపాధ్యాయురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

చరవాణిలో రహస్య యాప్‌..

ఉపాధ్యాయురాలి చరవాణిలో ఆమెకు తెలియకుండా రహస్యంగా ఓ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. దాని ద్వారా ఆమె చరవాణిని తన కంట్రోల్‌లోకి తీసుకున్నాడు. అశ్లీల చిత్రాలను బంధువులు, స్నేహితులకు పంపిస్తానంటూ బెదిరిస్తున్నాడు. ఆమెను వేర్వేరు ప్రాంతాలకు తీసుకువెళ్లి, శారీరక వాంఛ తీర్చుకునేవాడు. అతడి వేధింపులు మరింత ఎక్కువ కావటంతో.. బాధితురాలు ఈనెల 4వ తేదీన విజయవాడలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై మహిళా పోలీస్‌స్టేషన్‌ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం మహేశ్వరరావును మహిళా పోలీస్‌స్టేషన్‌ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు.

Also Read

Coronavirus Updates: మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు.. జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు..!(వీడియో)

Tirupati: వేల పాములకు ప్రాణాలు నిలిపిన పుణ్యం.. స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు క్షేమం

UP Elections 2022: ఉత్తర ప్రదేశ్ మొదటి దశ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న ప్రముఖ అభ్యర్థులు వీరే!