Tirupati: వేల పాములకు ప్రాణాలు నిలిపిన పుణ్యం.. స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు క్షేమం

TTD News: పాము కాటుకు తోడు మధ్యలో డెంగ్యూ కూడా సోకడంతో భాస్కర్ నాయుడు పరిస్థితి మరింత విషమించింది. ప్లేట్ లెట్స్ సంఖ్య బాగా తగ్గిపోవడంతో.. ఐసీయూలో వెంటిలేట‌ర్‌పై ఉంచి చికిత్స అందించారు.

Tirupati: వేల పాములకు ప్రాణాలు నిలిపిన పుణ్యం.. స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు క్షేమం
Snake Catcher Bhaskar Naidu
Follow us

|

Updated on: Feb 10, 2022 | 8:26 AM

Snake Catcher Bhaskar Naidu: టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు కోలుకున్నారు. పాము కాటుకు గురై 13 రోజులుగా మృత్యువుతో పోరాడిన భాస్కర్ నాయుడు.. ఎట్టకేలకు రికవర్ అయ్యారు. టీటీడీ సహకారంతో అమర ఆస్పత్రిలో ఆయనకు మెరుగైన వైద్య చికిత్స అందించడంతో కోలుకున్నారు. దీంతొ అమర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. నేడు మీడియాతో భాస్కర్ నాయుడు మాట్లాడే అవకాశం ఉంది. తిరుమల(Tirumala), తిరుపతిలో 10వేలకు పైగా పాములను పట్టుకున్న భాస్కర్ నాయుడు.. వాటిని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు. అయితే అన్ని వేళలు ఒకేలా ఉండవు. జనవరి 28వ తేదీ రాత్రి ఎస్వీ యూనివర్సిటీ(Sri Venkateswara University)ప్రాంగణంలోకి వచ్చిన ఓ పామును పడుతుండగా దురదృష్టవశాత్తు గ్లౌజ్ ఊడిపోయింది. దీంతో పాము కాటేసింది. వెంటనే ఆయనను స్విమ్స్‌కు తరలించారు. పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం భాస్కర్ నాయుడిని అమర ఆసుపత్రికి తరలించారు. పాము కాటుకు తోడు మధ్యలో డెంగ్యూ కూడా సోకడంతో ఆయన పరిస్థితి మరింత విషమించింది. ప్లేట్ లెట్స్ సంఖ్య బాగా తగ్గిపోవడంతో.. ఐసీయూలో వెంటిలేట‌ర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఎట్టకేలకు భాస్కర్ నాయుడు కోలుకోవడంతో తిరుపతి వాసులు, టీటీడీ సిబ్బంది  హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి భాస్కర్ నాయుడు టీటీడీ ఉద్యోగిగా రిటైర్ అయ్యారు. అయినప్పటికీ ఆయన సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం కొనసాగిస్తోంది. తిరుపతి, తిరుమలలో ఎక్కడైనా పాము కనిపించిందంటే.. సమాాచారం ఇవ్వగానే నిమిషాల వ్యవధిలో అక్కడికి వచ్చి పామును బంధించేవారు భాస్కర్ నాయుడు.

Also Read: Krishna District: కృష్ణా జిల్లాలో జరిగిన బాలిక హత్యకేసులో సంచలన విషయం.. బాబాయే