AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna District: కృష్ణా జిల్లాలో జరిగిన బాలిక హత్యకేసులో సంచలన విషయం.. బాబాయే

Andhra News: అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన చిన్నారులను చిదిమేస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే కాటేస్తున్నారు. బంధం ముసుగులో బలి చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో జరిగిన బాలిక హత్యకేసులో ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

Krishna District: కృష్ణా జిల్లాలో జరిగిన బాలిక హత్యకేసులో సంచలన విషయం.. బాబాయే
Girl Murder Case
Ram Naramaneni
|

Updated on: Feb 10, 2022 | 7:57 AM

Share

AP Crime News: వేలుపట్టి నడిపించాల్సిన వారే ముళ్లబాటలో వదిలేస్తున్నారు. నిత్యం అండగా నిలవాల్సిన వారే ప్రాణాలకు గండంగా మారుతున్నారు. ఏ పాపం తెలియని చిన్నారుల భవిష్యత్తును కాలరాస్తున్నారు. తాజాగా సొంత బాబాయే ఓ బాలిక పాలిట యముడిలా మారాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో కలకలం రేపుతోంది. కంచికచర్ల మండలం(Kanchikacherla mandal)కీసరలో సుబాబుల్ తోటల్లో బాలిక మృతదేహం లభ్యమైన ఘటనలో, పురోగతి సాధించారు పోలీసులు. నిందితుడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ను రిలీజ్ చేశారు పోలీసులు. ఈ ఘటనలో నిందితుడు సొంత బాబాయేనని తేల్చారు. అతను తన రిక్షా బండిపై కీసర నుంచి సుబాబుల్ తోటలోకి బాలికను తీసుకెళ్తున్న దృశ్యం సీసీ ఫుటేజ్‌లో నమోదైంది. ఎక్కడి నుంచో వచ్చి చిన్న డేరా వేసుకొని జీవిస్తోంది బాలిక కుటుంబం. రోడ్డు మీద అడుక్కొని పొట్ట నింపుకొని, మిగిలినవి కుటుంబానికి ఇస్తూ ఆసరాగా ఉంటోంది. బాలిక తల్లిదండ్రులు దారి వెంబడి ఉన్న చెత్త కాగితాలు, వ్యర్ధ పదార్ధాలు, ప్లాస్టిక్ అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వారి కుటుంబంలోకి ప్రవేశించాడు ఈ దుర్మార్గుడు. బజారుదాకా వెళదాము అనటంతో, బాబాయే కదా అని నమ్మి వెళ్లింది చిన్నారి. కానీ కానరాని లోకాలకు వెళ్తానని ఊహించలేకపోయింది.

ఆ బాలిక ఒంటిపై దుస్తులు కూడా సరిగా లేవు. అర్ధనగ్న స్థితిలో పడి ఉంది. బాలిక మృతదేహంపై గాయాలున్నాయి. దీంతో అత్యాచారం జరిగిందా అన్న అనుమానం కలుగుతోంది. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే బాలికపై అత్యాచారం జరిగిందో లేదో తేలనుంది. స్థానిక డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు.

Also Read: పెను విషాదం.. కుమారుడిని కాపాడబోయి.. భార్య, పిల్లల కళ్లెదుటే.