CA Results 2021: సీఏ ఫైనల్, ఫౌండేషన్ జూలై 2021 పరీక్షల ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే..
ICAI.. చార్టర్డ్ అకౌంటెంట్స్ (CA) ఫౌండేషన్, ఫైనల్ (old and new courses) జూలై 2021 పరీక్ష ఫలితాలను ఈరోజు (ఫిబ్రవరి 10) విడుదలచేసింది..
ICAI CA Result July 2021 Results: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) చార్టర్డ్ అకౌంటెంట్స్ (CA) ఫౌండేషన్, ఫైనల్ (old and new courses) జూలై 2021 పరీక్ష ఫలితాలను ఈరోజు (ఫిబ్రవరి 10) విడుదలచేసింది. అభ్యర్థులు తమ పరీక్షల ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ icaiexam.icai.org లేదా caresults.icai.org లేదా icai.nic.inలలో తనిఖీ చూసుకోవచ్చు. అభ్యర్ధులకు సంబంధించిన రోల్ నంబర్ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా పిన్ నంబర్‌లతో లాగిన్ అయ్యి ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్ధులకు కూడా సీఏ ఫౌండేషన్, సీఏ ఫైనల్ పరీక్షల ఫలితాలను వారి వారి మెయిల్‌లకు పంచించింది. కాగా ఐసీఏఐ అధికారిక ట్విటర్ అకౌంట్ ద్వారా ఈ రోజు సీఏ ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ 2021లో జరిగిన చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫైనల్ ఎగ్జామినేషన్, సీఏ ఫౌండేషన్ ఎగ్జామినేషన్ ఫలితాలు ప్రకటించినట్లు ట్విటర్ పోస్టులో పేర్కొంది.
ICAI CA జూలై 2021 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..
- మొదటిగా icaiexam.icai.org లేదా caresults.icai.org లేదా icai.nic.in ఏదైనా ఒక వెబ్‌సైట్‌ను ఓపెన్ చెయ్యాలి.
- హోమ్‌పేజీలో కనిపించే రిజల్ట్స్ లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
- అవసరమైన వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
- స్క్రీన్ పై కనిపించే స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి.
Important Announcement – Results of the Chartered Accountants Final Examination (Old Course & New Course) and Foundation Examination held in December 2021 have been declared. Results can be checked athttps://t.co/344CfPdhymhttps://t.co/sxQNhLv0uqhttps://t.co/HS8oDSRLZn pic.twitter.com/OCn7Msi0Gh
— Institute of Chartered Accountants of India – ICAI (@theicai) February 10, 2022
సీఏ ఫౌండేషన్ పరీక్షలు గత యేడాది డిసెంబర్ 13,15,17,19 తేదీల్లో నిర్వహించబడ్డాయి. ఇక సీఏ ఫైనల్ పరీక్షలు డిసెంబర్ 5 నుంచి 19 తేదీల మధ్య దేశవ్యాప్తంగా 190 కంటే ఎక్కువ జిల్లాల్లో ఆఫ్‌లైన్ మోడ్‌లో పరీక్షలు జరిగాయి. వీటికి సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి.
Also Read: