Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: పుష్పరాజ్‌గా మారేందుకు బన్నీ ఎంత కష్టపడ్డాడో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘పుష్ప’ (Pushpa). రష్మిక మందన హీరోయిన్‌గా నటించగా, సమంత స్పెషల్‌ సాంగ్‌ తో సందడి చేసింది.

Pushpa: పుష్పరాజ్‌గా మారేందుకు బన్నీ ఎంత కష్టపడ్డాడో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే..
Pushpa
Follow us
Basha Shek

|

Updated on: Feb 10, 2022 | 7:17 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘పుష్ప’ (Pushpa). రష్మిక మందన హీరోయిన్‌గా నటించగా, సమంత స్పెషల్‌ సాంగ్‌ తో సందడి చేసింది. అనసూయ, సునీల్‌, ఫాహద్‌ పాజిల్‌ కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్‌ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ పాన్‌ ఇండియా చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. బన్నీ నటన, సుకుమార్‌ టేకింగ్‌, సామ్‌ స్పెషల్‌ సాంగ్‌, డైలాగులకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. థియేటర్లలో విడుదలైన నెలకే ఓటీటీలో వచ్చినా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప.. ఈ ఏడాది కూడా తన జోరు కొనసాగిస్తోంది. ఇటీవలే 50 రోజులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం సుమారు రూ. 365 కోట్లకు పైగా వసూలు చేసిందని దర్శక నిర్మాతలు ప్రకటించారు. కాగా ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్‌ ‘పుష్పరాజ్‌’ పాత్రలో బన్నీ నటించాడు. తొలిసారి ఊర మాస్‌ లారీ డ్రైవర్‌ క్యారెక్టర్‌లో బన్నీ నటన అదిరిపోయింది. సెలబ్రిటీల నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి.

రెండు గంటల పాటు మేకప్‌..

అయితే పుష్పరాజ్‌గా రఫ్‌ లుక్‌లో కనిపించేందుకు తాను ఎంతో పడ్డానని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు ఐకాన్‌ స్టార్. ఈ నేపథ్యంలో సినిమాలో బన్నీ మేకోవర్‌కు సంబంధించిన వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ‘ఇప్పటివరకు పుష్పలోని ఫైర్‌ నే చూశారు. మరి ‘పుష్ప’ లా కనిపించేందుకు అల్లు అర్జున్‌ ఎంత ట్రాన్స్‌ఫార్మ్‌ అయ్యారో’ చూడండి అంటూ రిలీజ్‌ చేసిన ఈ వీడియో బన్నీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. పుష్ప రాజ్ పాత్ర కోసం అల్లు అర్జున్ మేకోవర్ అయిన తీరును చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ‘మాస్‌ లుక్‌లో కనిపించేందుకు సుమారు 2 గంటల పాటు మేకప్‌ వేసుకోవాల్సి వచ్చేది. ఇందుకోసం తెల్లవారుజాము 4.30 సెట్‌ కు వెళ్లేవాన్ని. 5 నుంచి 7 గంటల పాటు మేకప్‌ కోసం ఓపికగా కూర్చొనేవాన్ని. షూటింగ్‌ పూర్తయ్యాక మేకప్‌ తీసేసేందుకు మరో 40 నిమిషాలు కేటాయించాల్సి వచ్చేది’ అని సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో చెప్పుకొచ్చాడు ఐకాన్‌ స్టార్‌. కాగా ప్రస్తుతం పుష్ప సీక్వెల్‌ ‘పుష్ప..ది రూల్‌’ షూటింగ్ కోసం సిద్ధమవుతున్నాడు బన్నీ.

Also Read:Akkineni Sumanth: వాల్తేర్‌ శీనుగా అక్కినేని హీరో.. అదిరిపోయిన ఫస్ట్‌ లుక్‌..

IPL 2022: రోహిత్ శర్మను ఐపీఎల్ మొదటి సీజన్‌లో ఎంతకు దక్కించుకున్నారో తెలుసా.. ప్రస్తుతం 5 రేట్లు పెరిగిన అతని ధర..

Nasal Spray: కరోనా బాధితులకు తీపికబురు.. దేశంలోనే తొలిసారిగా నాజల్‌ స్ప్రే