AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరేంద్ర సెహ్వాగ్‌ వారసుడి విధ్వంసం.. డూ ఆర్ డై మ్యాచ్‌లో సెంచరీ..!

Aaryavir Sehwag Century: అండర్‌-19 ఆసియా కప్‌లో భారత యువ బ్యాటర్ ఆర్యవీర్ సెహ్వాగ్ అద్భుతంగా ఆడుతున్నాడు. యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో శతకం సాధించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అతడికి వి.కె. వినీత్ చక్కటి సహకారం అందించడంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది.

వీరేంద్ర సెహ్వాగ్‌ వారసుడి విధ్వంసం.. డూ ఆర్ డై మ్యాచ్‌లో సెంచరీ..!
Aaryavir Sehwag Century
Venkata Chari
|

Updated on: Nov 10, 2026 | 12:54 PM

Share

Aaryavir Sehwag Century: ఒమన్‌లో జరుగుతున్న అండర్‌-19 ఆసియా కప్‌లో భారత యువ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. యూఏఈ అండర్‌-19 జట్టుతో జరుగుతున్న 11వ మ్యాచ్‌లో భారత బ్యాటర్ ఆర్యవీర్ సెహ్వాగ్ (Aaryavir Sehwag) అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు.

ప్రస్తుతం భారత్‌ 33.5 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది. ఆర్యవీర్ 131 బంతుల్లో 100 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. అతడికి వి.కె. వినీత్ (V.K. Vineeth) చక్కటి సహకారం అందిస్తున్నాడు. వినీత్ 40 బంతుల్లో 29 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.

ఆర్యవీర్ సెహ్వాగ్ శతకం ప్రత్యేకత ఇదే!

భారత మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుటుంబానికి చెందిన ఆర్యవీర్ తన బ్యాటింగ్‌తో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో 131 బంతులు ఎదుర్కొని సెంచరీ పూర్తి చేశాడు. యువ క్రికెట్‌లో తన ప్రతిభను మరోసారి చాటుకున్నాడు.

భారత్ భారీ స్కోరు దిశగా!

ఆర్యవీర్, వినీత్ మధ్య రెండో వికెట్‌కు 120 బంతుల్లో 97 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. యూఏఈ బౌలర్ బి. ఖాన్ 8.5 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చాడు. భారత్‌ చేతిలో ఇంకా వికెట్లు ఉండటంతో చివరి ఓవర్లలో స్కోరు మరింత పెరిగే అవకాశం ఉంది.

Follow Us